పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రములను ధనమును ప్రోగుచేసి యొక పెద్ద మూటను గట్టి ఇంట నున్నవారు సహిత మెఱుఁగకుండ రహస్యముగ బైరాగియొద్దకుఁ దీసికొని వచ్చిరి అతఁడు వెంటనే పిడకలదాలి పెట్టించి యా మూటను రాజశేఖరుడుగారి చేతులతోనే దానిలోఁ బెట్టించి పుటమువేసి ఆయ నను లోపలికిఁబోయి విసన కఱ్ఱను దెమ్మని పంపెను. రాజశేఖరుఁడు గారు విసనకఱ్ఱను బట్టుకొని మరల వచ్చునప్పటికి బైరాగి గొట్ట ముతో నూదుచుండెను. అప్పుడు బైరాగి మఱికొన్ని పిడకలను పైనిబెట్టి మంట చేసి, తాను వేమగిరి కొండమీఁదనున్న మూలికలను గొనివచ్చుట కయి వెళ్ళేదననియు, తానుబోయి వానిని గొనివచ్చి వనరు పిండినఁ గాని యంతయు బంగారము కాదనియు, దాను వచ్చులోపల పిడక లను వేసి మంట చేయుచు జాగ్రత్తతోఁ గనిపెట్టుకొని యుండ వలయుననియుఁ జెప్పి, మూలికల నిమిత్తమయి వెళ్లెను. ఆతఁడు వనమూలికలకయి వెళ్ళి యేవేళకును రానందున, రాజశేఖరుఁడుగారు తామక్కడనే యుండి, బైరాగిని పిలుచుకొనివచ్చుటకయి మనుష్యు లను బంపిరి. వారును గొండయంతయు వెదకి యెక్కడను అతని జాడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపు కొండలకుఁ బోయినాఁడేమో యనుకొని మరలి వచ్చి యా వార్తను జెప్పిరి. ఆ బైరాగి బంగారముచేయు మూలికలు దొరకనందున గాబోలు మరల రానేలేదు. అతని నిమిత్తమయి యొక దినమువఱకు వేచియుండి రాజ శేఖరుఁడుగారు పటముదీసి చూచునప్పటికి దానియందు బంగార మును, వెండియు లేదుగా ని తెల్లని భస్మము మాత్ర ముండెను. సుల భముగా రజత భస్మమును నువర్ణ భస్మమును నయినందున రాజశేఖరుడుగారు పుటముదీసిచూచునప్పటికి దానియందు బంగారమును, వెండియులేదుగాని తెల్లని భస్మము మాత్రము ముండెను.సులభముగా రజిత భస్మమును సువర్ణ భస్మము నయినందున రాజశేఖరుడుగారు సంతోషించి పదిలముగా దానిని దాచిరి. కాని, యేమి కారణముచేతనో యా భస్మమునందు బరువుగాని సువర్ణాది భస్మముల యందుండు గుణముకాని కనపడలేదు.