పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యెవ్వరో కొట్టుచున్నట్టు చిన్నచిన్నదెబ్బలు వినఁబడినవి; ఆ పిమ్మట నొక పెద్ద దెబ్బ వినబడెను. ఈ ప్రకారముగా నరగడియ సేపు దెబ్బలు వినఁబడుచువచ్చి సద్దడఁగినతరువాత గ్రహము సులభముగానె దొరికెననియు దానినిప్పుడే తీసికొనిపోయి గోదావరిలోఁ గలి పెద ననియుఁ జెప్పి తానొక్కఁడును గదిలోనికిఁబోయి యందలి సమ స్త్ర వస్తువులను దీసికొని హరిశాస్త్రులు వెళ్ళిపోయెను. ఆ మఱుచటి దినము మొదలుకొని క్రమక్రమముగా రుక్మిణి జబ్బు వదలి యారోగ్యమును బొందసాగెను. తరువాత నా బ్రాహ్మణుఁ డొకదినము రాగి రేకుమీఁద నొకప్రక్కను ఆంజనేయ విగ్రహమును బీజాక్షరములను, రెండవప్రక్కను ఎటుకూడినను ముప్పదినాలుగు వచ్చునట్లుగాఁ బదు నాఱుగదులుగల దిగువ నున్నరీతి యంత్రమును వేసి, ఆ రక్షరేకును రుక్మిణి మెడకుఁ గట్టి యదియున్నంతకాలము నేవిధమయిన గాలియు సోఁకదని చెప్పెను. కొమార్తె యొక్క గ్రహబాధ నివారణ

౧౦ ౧౬
౧౫
౧౪ ౧౨
౧౧ ౧౩

చేసినందునకయి రాజశేఖరుడుగారు శాస్త్రులకు దోవతులచాప కట్టఁ బెట్టుటయేకాక నూటపదియాఱురూపాయలను బహుమాన మిచ్చిరి. శాస్త్రులారాత్రి అమ్మవారి పెట్టెను దెచ్చినప్పుడందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళను మాత్రము తెచ్చుకొనెను. ఆవలి కందఱను బంపి వేసి తా నొక్కఁడును లోపలఁ గూరుచున్నప్పుడు తలుపువేసికొని, గదియొక్క మట్టిమిద్దెకు నడుముగా మేకలను దిగఁగొట్టి యామేకు