పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవలారచనకు శ్రీకారం:
వచన రచనకు ఒజ్జబంతి

రాజశేఖర చరిత్ర మనే వివేక చంద్రిక తొలుదొలుత వివేక వర్ధని పత్రికలో 'సీరియల్' గా వెలువడింది, 1874 వ సంవత్సరంలో వీరేశలింగం పంతులుగారు వివేక వర్ధని అనే మాసపత్రికను స్థాపించి, దురాచార నిరసనకూ, సంఘ సంస్కారానికీ, దుర్మత భంజనానికీ పాటుపడ్డ విషయం లోక ప్రసిద్ధమే. ఆ పత్రికలో 1875 వ సంవత్సరంలో ఆరంభమై, సీరియల్ గా వెలువడి 1878 వ సంవత్సరంలో ఫుస్తక రూపాన్ని పొందింది, ఆ రోజుల్లోనూ అటుపిమ్మటా కూడా, విశేషమైన ఆదరాన్ని పొందింది. తొలి తెలుగు నవలగా కూడా పేరు ప్రఖ్యాతులను పొందింది ఇప్పటికి తొమ్మిది ముద్రణలు పొందటం యీ రాజశేఖర చరిత్ర ప్రసిద్ధి కొక తార్కాణ కదా! ఇప్పుడీ పాకెట్ బుక్స్‌లో పదవసారి వెలువడుతున్నదన్నమాట. ఇంతేకాక వేర్వేరుగా ఇరువురు దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఒక అనువాదం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మ్యాగజైనులో కొంతభాగం వెలువడింది. వేరొక అనువాదం అదృష్ట చక్రం (Fortune's wheel) పేరుతో లండన్‌లో పుస్తక రూపాన అచ్చుకావటమే కాకుండా, 'లండన్ టైమ్స్' పత్రిక యొక్క బహుళ ప్రశంస లను కూడా అందుకుంది. ఆనాటి 'లండన్ టైమ్స్' వీరేశలింగం పంతులు గారిని కూడా చాలా శ్లాఘించింది. ఇక దేశీయ భాషలపై రాజశేఖర చరిత్రం ప్రభావం గమనిస్తే, ఆ రోజుల్లోనే యీ నవల తమిళ, కన్నడ భాషల్లోకి ఆనువదింప బడటం, దీని గొప్పను నిరూపిస్తుంది, ఇది ఆలివర్ గోల్డ్ స్మిత్