పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నార్ధము వెళ్లెను. అక్కడ విసుకచల్లిన రాలకుండు మూఁకలలో నుండి బలముగలవారు దేవునకుఁ బండ్లియ్యవలె నను నపేక్షతో దూకి సందడిలోఁ బడి దేవతాదర్శన మటుండఁగా మందిలోనుండి యిూవలఁబడినఁ జాలునని నడుమనుండియే మరలి యీవలకు వచ్చి సంతోషించుచుండిరి. వారికంటె బలవంతులయినవారు గర్భాల యమువఱకును బోయి పండ్లను డబ్బును పూజారిచేతిలోఁ బెట్టి యీవలఁ బడుచుండిరి. ఆర్చకులను ఒకరువిడిచి యొకరు వెలు పలకివచ్చి చెమటచేఁ దడిసిన బట్టలను పిండుకొని వెలుపలగాలిలో కొంతసేపు హాయిగానుండి మరల గర్భాలయములోఁ బ్రవేశించి యా యుక్కలో బాధపడుచుండిరి. ఈ ప్రకారముగా వచ్చిన యర్చ కులలో నొకఁడు మాణిక్యాంబను జూచి యా మెచేతిలోని పండ్లను బుచ్చుకొని లోపలికిఁ బోయి స్వామికి నివేదనచేసి వానిలోఁ గొన్ని పండ్లను తులసిదళములను మరలఁ దెచ్చియిచ్చి యందఱ శిరస్సుల మీఁదను శఠగోపము నుంచెను. అంతట మాణిక్యాంబ వెనుక తిరిగి యాలయద్వారమును దాఁటుచుండెను. రుక్మిణి యామెచెఱఁగు వెనుక నిలుచుండెను. ఒక ప్రక్క సీతయు మఱియొక ప్రక్క నొక ముత్తైదువయు నిలువఁబడిరి. ఆ సమయములో నెవ్వఁడో వెనుకనుండి రుక్మిణి మెడలోనికి చేయిపోనిచ్చి కాసుల పేరును పుటుక్కున త్రెంచెను. రుక్మిణి వెనుకకు మరలి చూచు నప్పటికి చేయియుఁ గాసుల పేరునుగూడ నదృశ్యములాయెను. రుక్మిణి కేకతో పదిమందియు వచ్చి దొంగను పట్టుకొనుటకయి ప్రయత్నముచేసిరి కాని యా దొంగసహితము వారిలోనే యుండి తానును దొంగనే వెదుకుచుండెను. అప్పుడు రుక్మిణి మొదలగు వారు ప్రదోషసమయమున నగ పోయినందునకయి మఱింత విచారించుచు నింటికిఁ బోయిరి.