పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెల్లగా బ్రేరేపించి, ఆయన చేత ఆందఱును సభలో గూర్చండి యుండగా "నాయనా! మన యింట ఆఁడుపిల్లలను జదివించు నంప్ర దాయము లేదే, మన రుక్మిణి నేల చదివించెదవు?' శేఖరుఁడుగారు విద్యవలని లాభముల నెఱిగిన వాఁ డగుటవలనను, స్త్రీ విద్య యే శాస్త్రమునందును నిషేధింపఁబడియుండక పోవుటయు పూర్వపు పతివ్రతలందఱు విద్యావతులయి మండుటయునెఱిగినవాఁ డగుటవలనను ఆ వృద్ధుని వాక్యములను లక్ష్యము చేయక స్త్రీ విద్యా భ్యాసమున కనుకూలముగాఁ గొన్ని స్మృతి వాక్యములను జదివి మీ యభిప్రాయ మేమని సభలోనున్న వారి నడిగెను. వారందఱును మనసులో స్త్రీవిద్యయన్న నేవగించువారే యయినను రాజశేఖరుఁడు గారి యభిప్రాయము తెలిసిన పిమ్మట దానికి వ్యతిరి క్తముగా నేమియు జెప్ప నలవాటుపడినవారు కారు గావున స్త్రీవిద్యాభ్యాసమువలన గణనా తీతము లయిన లాభములు గలవని పొగడి రుక్మిణికి విద్య నేర్పు చున్నందునకయో రాజశేఖరుడుగారిని శ్లాఘించిరి.

చిలుక పంజర మున్నతావునుండి నాలుగుబారలు నడచిన తరు వాత పడమటింటిద్వారమున్నది. పడమటియల్ల విశాలమయి యేఁబది మంది బ్రాహ్మణులు భోజనములు చేయుటకుఁ జాలియుండును. ఇక గొంచెముసేపునకు భోజనములకు లేత రనఁగా వెళ్ళి చూచిన యెడల, మూరెడు మూరెడెడముగా రెండుగోడల పొడుగునను పీట లను, పీటలకు ముందఱ పిండి మ్రుగ్గుతో పెట్టిన పట్లును చాలుగా నుండును. పడమటింటి యీశాన్యమూలన గచ్చుతోఁగట్టిన దేవు నరుగు కలదు. ఆ యరుగుపయిని "భువనేశ్వర"మను దేవతార్చన సామానులను సాలగ్రామాదులను పెట్టు పెట్టె

యుండును. ఆ పెట్టె మీఁదనే రాజశేఖరుడుగారు మడితో నిత్యమును పారాయణచేయు శ్రీమద్రామాయణము సుందరకాండను పెట్టఁబడియుండెను. రాజశేఖరుఁడుగారు స్నానముచేసి వచ్చి దేవునరుగుమందఱ పీటవేసికొని కూర్చుండి రామాయణమును పంచపూజయు చేసికొందురు. దేవు నరుగున కెదురుగానున్న తలుపుతీసికొని యావలకు వెళ్ళినచో నొక

44