పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చోట్లనెల్ల నిదేకర్మము. లోకములో ఆత్తలెల్ల ఒకసారి చచ్చిరా__"

పొట్టిది__శేషమ్మా! నీ అత్తగారుకూడ నిన్ను చాలా బాధ పెట్టునని విన్నాను. నిజమా?

శేష__బాధ గీధ నాకు తెలియదు. కోత పడలేక చచ్చి పోవుచున్నాను. జాము తెల్లవాఱ లేచి యింటి ప్రాచియాంతయుఁజేసి, అంట్లు తోమి, యింటికి కావలసిన నీళ్ళన్నియు తోడి, మడిబట్టలుదికి, ఆమె లేచువఱకు పనులన్నియు జేయుదును. అప్పడు నాలుగు గడియల ప్రొద్దెక్కి లేచి కన్నులు నలుపుకొనుచు వచ్చి గరిటెనంటు వదలలేదని, వాకిటిలోఁ బెంట యట్టేదీయున్నదని తిట్ట మొదలు పెట్టును. తరువాత పేడచేసి గోడమీఁద పిడకలు చఱిచి ఱెక్కలు విఱుచుకొని జాము ప్రొద్దిక్కి చలిది భోజనమునకు వచ్చువఱకు, 'ఒక మూల తెల్లవాఱకమునుపే తిండికి సిద్ధపడుదుపు, పనిమాత్రము ముట్టుకోవని వంట చేసికొనుచు సాధించుచుండును, పగలు మగనితో మాటాడితే దప్పుగదా? రాత్రి యందఱి భోజనములు అయిన తరువాత అత్తగారికి కాళ్ళుపిసికి యామె నిద్రపోయిన తరువాత వెళ్ళి పడుకోఁబోవు నప్పటికి రాత్రి రెండు యామములగును. పడుకొన్నది మొదలుకొని యెప్పడు తెల్లవాఱిపోవునో, వేళకుఁ బనిగాకున్న అత్తగా రెక్కడ కోపపడునో అని నిద్రలో సహిత ములికి పడు చుందును; ఎట్లు చేసినను నాకు తిట్లును దెబ్బలను తప్పవు గదా? అని మొగమునకు కొంగడ్డము పెట్టుకొని నేత్రముల నీరు కార్పఁ జొచ్చెను.

రుక్మి__అత్తగారికి కోపము తెప్పించకుండ జేసెడు పనిని నీవు తిన్నగానే చేయరాదా?

శేష__అయ్యో! రుక్మిణమ్మా! నీక త్తగారు లేదు గనుక నీ కీసంగతు లేమియుఁ దెలియవు. ఎంతపని చేసినను అత్తగారి కెప్పుడును మెప్పు లేదు. కలయంపి చల్లునప్పుడు చిక్కగాఁ జల్లిన. 'ఇల్లంతయు సముద్రము చేసినావు, జాఱిపడి చచ్చిపోనా" యని తిట్టును. పలచగాఁ జల్లిన, "నీళ్ళకు కఱవువచ్చినట్లు పేణ్నీళ్ళే చల్లి

32