పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధాంతి-"చిత్తం చిత్తము. తమ యనుగ్రహమువల్ల మే మందఱము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన నన్న వస్త్రాదు లిచ్చి కాపాడఁగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండఁగా మా వంటి వారి కేమి కొదువ మా గ్రామము చేసి కొన్న భాగ్యముచేతను, మా పురాకృత పుణ్యము చేతను, తమవంటి దాన కర్ణులు మా గ్రామమునకు విజయం చేసినారు గాని మఱియుకటి కాదు" అని రామశాస్త్రిగారి వంకఁ దిరిగి, "మనము వారి ముఖము ముందఱ స్తుతిచేయవలసినది కాదు గాని రాజశేఖరుఁడుగారు కేవ లము నీశ్వరాంశ సంభూతులు సుండీ."

ఆ మాటల కాదరమును సూచించెడి మందహాసము చేసి రామ శాస్త్రి "అందుకు సందేహమేమి? ఈ సంగతి మీరు నాతోఁ జెప్ప వలెనా? వారీ గ్రామమున నుండఁబెట్టి మన మందఱము వారియండను విలువఁగలిగినాముగాని, లేని యెడల నిండ్లును వాఁకిళ్ళను విడిచిపెట్టి మన మీపాటికి దేశములపాలయి లేచిపోవలసినవారము కామా? వారి తండ్రిగా రిక్కడకు వచ్చినప్పటినుండి యిది యొక గ్రామముగాఁ గనబడుచున్నదిగాని యింతకుఁ బూర్వము దీనికి నామరూవము లున్నవా?"

అని, మంచి సమయము తటస్థించినప్పడు తన పాండిత్య మును దాఁచిపెట్టక, అందుకొని సిద్ధాంతిగారి స్త్రోత్రపాఠములకు సాయ ముగాఁ దనవి కూడ నాలుగు కలిపెను.

అప్పడు రాజశేఖరుఁడుగారు మనసులో మిక్కిలి సంతోషించి నను పయి కాసంతోషము కానరాకుండ నఁడచికొని "పిద్ధాంతిగారూ! మొన్న మీ రెండవ చిన్నదాని కేమో గ్రహబాధ కనఁబడ్డట్టు విన్నాను. కొంచెము నిమ్మళముగా నున్నదా"

అని యడిగినతోడనే సిద్ధాంతిగారు మోమున దీనభావము గాని పింపఁ గొంచెమాలోచించి తలయూఁచి "జోస్యుల కామావధానుల చేత విభూతి పెట్టించుచున్నాను. కాని దానివల్ల నిన్నటి కేమియు గుణమే కనఁబడలేదు. జాతకరీతిచే దాని కిప్పుడు శని చాలదు. ఎందుకైనను

20