పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైన దానినిగాఁజేయఁ జూచుచుందురు గదా? నే నిట్ల నేక వేషములు వేసి కడపట బైరాగినై వీరినిద్దఱిని శిష్యులనుగాఁ గైకొని చిదానంద యోగి యను పేర ధవళేశ్వరము ప్రవేశించి, యీ రాజశేఖరుఁడు గారినే స్వర్ణముచేసి యిచ్చెదనని మాయచేసి యిప్పుడు తమయొద్దకుఁ దెచ్చిన నగలనే యవహరించుకొని పోతిని. అక్కడనుండి పోయిన పిమ్మట గడ్డమును మీసమును గొఱిగించుకొని నీలాద్రిరాజు నయి పిఠాపురము ప్రవేశించి, వీండ్రసాయముచేతనే రాజుగారి ధనాగారములోని ధనమును తరలించితిని. ఈ రెండు చోట్లను నేను జరిగించిన యద్భుత చర్యలును నా నటనమును రాజశేఖరుఁడుగారును కొమారుఁడును చక్కగాఁ జెప్పఁగలరు కనుకను, ఆత్మప్రశంస యను చిత మగుటచేతను, ఇంతటితోఁ జాలించు చున్నాను_ అని యూర కుండెను.

కృష్ణజగపతి మహారాజులుగా రాతని చరిత్రము విన్న తరువాతను నిమిష మాలోచించి, పద్మనాభుని వంకఁ దిరిగి "నీ విప్పడు బుద్ధి తెచ్చుకొని నిజముగా బశ్చాత్తప్తుఁడ వైనాఁడవు గనుక, నిన్నొక్క- సంవత్సరము కారాగృహమునందుఁ బెట్టింప నిశ్చయించినా' మని చెప్పి, కారాగృహాధికారి కట్టియుత్తరువును వ్రాసి యాతనిని రాజభటుల వెంబడిని చామర్లకోటకుఁ బంపివేసిరి. తరువాత పిఠాపురపు వారి ధనము నచ్చటికి వెంటనే పంపివేయ మంత్రి కాజ్ఞచేసి, దొంగతనమును పట్టుకొన్నందునకు సుబ్రహ్మణ్యమును శ్లాఘించి రాజశేఖరుఁడుగారివంకఁ దిరిగి రాజుగా రిట్లు చెప్పిరి:

"మీ రిదివఱ కెన్నో కష్టముల ననుభవించి యా యాపదల నన్నిటిని గడచి మరల సుఖము ననుభవించు దశకు వచ్చుచున్నారు. కాఁబట్టి మీకు నేను కొన్ని హితవాక్యములమ జెప్పబోవుచున్నాను. మీరు నా మాటలను సావకాశముగా వినవలెను. పడిన తరువాత లేచుట గొప్పతనముగాని యెప్పుడును పడకుండుట గొప్పతనము కాదు. మీ రీనీతిని మనసునం దుంచుకొని వెనుకపడిన కష్టములకై విచారపడ కుండవలయును. ఇతరులు చేయు ముఖస్తుతుల కుబ్బి, ఆదాయ