పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జరగనందున పీనుగుల మోచు వ్యాపారమునఁ బ్రవేశించి ముసలివాఁ డయి తాను చిన్నప్పుడైనను చదువు కొన్నవాఁడు కాకపోయినను తుదకు చదువుల బడిని జీవనోపాధిగా నేర్పరచుకొని మా గ్రామమును జేరెను. ఆతఁడు చెప్పెడు చదువొక్క ముక్కయైనను లేకపోయినను గొట్టెడి దెబ్బలు మాత్ర మక్షరలక్షగా నుండెను. ఆయన నాతఁడు ధనమిచ్చినవారియెడ మిక్కిలి ప్రేమగలవాఁడు గనుక నాతల్లిదండ్రులు చిఱుతిండి నిమిత్తమయి నాకిచ్చెడి సొమ్ములో సగము పంతులకిచ్చి దెబ్బలు తప్పించుకొంటిని. అందుచేత పంతులు నామీఁద నత్యంత ప్రేమగలవాఁడై నాకు బడిపెత్తనమిచ్చి, నా తల్లిదండ్రులతో మీ కొమారునంతటి బుద్ధిమంతుఁడు లేఁడని చెప్పుచుండును. చిన్నప్పటి నుండియు నేను నిజముగా సూక్ష్మబుద్ధి గలవాఁడను నేర్పుకలవాఁ డను అవుదును. నా నేరుపరితనమువలన మావారి కెప్పుడును నష్టమేకాని చిల్లిగవ్వయైనను లాభము కలుగకపోయినను నా జననీ జనకులు నన్ను నేరుపరినిగానే యెంచి సంతోషించుచుండిరి. ఏల యనిన నేను నా నేరుపంతయు నితరులను మోసము చేయుటయందే యుపయోగించుచు వచ్చితిని. నేను మోసములను నేర్చుకొనుటలో నిచ్చిన శ్రద్ధలో సగమైనను ఏదో యొకవృత్తిని నేర్చుకొనుటలో నిచ్చియుంటినేని, నేనీపాటికి యెంతో భాగ్యవంతుఁడనై యుందును. ఆ సంగతి నట్లుండనిండు. నాకు బడిపెత్తనము వచ్చుటచేత పంతులతో చాడీలు చెప్పి కొట్టించెదనని పిల్లలను బెదరించి తినుబడి పదార్ధములను లంచము పుచ్చుకొనుచుందును. ఇట్లుండగా నా దురదృష్ట వశమున ఆ పంతులు కాలము చేసెను. ఆ కాలములో పంతు లెంత విస్తారముగా దెబ్బలు కొట్టుచున్న నంత గట్టివాఁడనిపించుకొను చుండును గనుక చదువుకొన్న పంతు లదివఱకే మాయూర బడిపెట్టు కొనియున్నను, అతఁడు పిల్లల యందు ప్రేమగలవాఁడై నిష్కారణముగా కొట్టుటకు పాలుపడనందున, పిల్లల నెవ్వరు నాతని బడికిఁ బంపకుండిరి. ఇప్పుడు గ్రామములో రెండవ పంతులు లేనందున, మా బడిలోని పిల్లల నందఱును విధిలేక యక్కడకే పంపవలసి