పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వాములవారు మునుపు మాన్యముల మీఁద నున్న ఋణములను దీర్చివేసి నలుగురు కొమాళ్ళకును వివాహములు చేసి కోడండ్ర కొక్కొకరికి రెండేసి వందల రూపాయల యాభరణము లుంచినారు. ఇప్పు డీ స్వాములవారి పేరు శ్రీ చిదానంద శంకర భారతీస్వామి యఁట.

అని మాటాడుకొనుచు వారు రాజసభకుఁ బోవునప్పటికి రాజు గారు కొలువు కూటమునకు విజయంచేసి సింహాసనాధిష్టితులై కూరు చుండి యుండి మంత్రి తెచ్చియిచ్చిన విజ్ఞాపన పత్రికలను జదివి చూచుకొని పిఠాపురమునుండి వచ్చిన దొంగలను తమ యెదుటఁ బెట్టుట కుత్తరువు చేసిరి. ఈ లోపల రాజశేఖరఁడుగారును సుబ్ర హ్మణ్యమును నృసింహస్వామియు సభ ప్రవేశించి తగిన చోటులఁ గూరుచుండిరి; రాజభటులను దొంగలను గొనివచ్చి ప్రభువు నెదుర నిలువఁబెట్టి తాము ప్రక్కలను కత్తులు దూసికొని నిలుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయఁజూచి "యీ దొంగలను పట్టుకొన్న వారెవరని ప్రశ్న పేసిరి. సుబ్రహ్మణ్యము లేచి నిలువఁబడి 'నేను' అని మనవి చేసెను, తోడనే ప్రభువువారు రాజశేఖరుడుగారి వంక దృష్టి బరపి"యీతడు మీ కొమారుఁడు కాఁడా" అని యడిగి"చిత్త" మని యాయన బదులు చెప్పఁగా విని యెడమప్రక్కను గూరుచున్న వారెవరని మరల నడిగిరి. రాజశేఖరుఁడుగారు చేతులు కట్టుకొని నిలుచుండి యిూతఁడు తమ యల్లుఁడగుటయు గిట్టనివాఁ డొకఁడు ఆతఁడు వారణాసిపురముననున్న కాలములో వచ్చి మృతుఁ డయ్యెనని వట్టి ప్రవాదము వేయుటయు రుక్మిణి దొంగలచేత దెబ్బతిని మూర్ఛపోయె యుండఁగా తన్నందఱును దిగవిడచిపోయిన తరువాత మూర్చ తేఱి పురుష వేషము వేసికొని సీత నెత్తుకొని పోయిన గ్రామమునుండి చెల్లెలితోఁ గూడ వచ్చుటయు సమగ్రమముగా విన్నవించిరి. రాజు గారు హర్షమును దెలుపుచు శిరఃకంపము చేసి, కొంతసే పూరకుండి యావంక దిరిగి 'మీరేమి చెప్పుకొనెద'రని యడిగిరి.

నీలా__సర్వమును దెలిపిన దేవరవారికడ మేము వేఱుగ