పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పి, గురువే దైవమని నమ్మి కొలిచిన వైకుంఠము కరస్థమని పలికి, బుజములమీఁద తప్తముద్రధారణము చేసి, మా గురుదక్షిణ పుచ్చుకొని మా దారిని మేము పోదుము. మే మెవ్వరితోను ప్రసంగించము గనుక మమ్మందఱును పండితులే యనుకొందురు.

రాజ__మీరీ గ్రామములో పది దినములు లుందురా?

వైష్ణ__ఉండము. రేపే వెళ్ళిపోయెదము. తరువాత సావ కాశముగా దర్శనముచేసి మాటాడెదను.

అని యాతఁడు పల్లకితోఁ గలిసిగొనుటకయి పరుగెత్తెను.

వారు వెళ్ళిన తరువాత వీధితలుపు వేసివచ్చి మగవారు రాత్రి భోజనమునకుఁ గూరుచున్నతోడనే యెవరో వచ్చి వీధి తలుపుకడ “రాజశేఖరుఁడు మామగారూ!"అని పిలవఁజొచ్చిరి. మాణిక్యాంబ నడవలోనికి వెళ్ళి "యెవరువార"ని యడుగంగా "నేను నృసింహ స్వామి’ నని వెలుపలినుండి యొకరు పలికిరి. ఆ మాట యొక్కధ్వనియు పేరును విన్నతోడనే మాణిక్యాంబ భయపడి తటాలున లోపలికిఁ పరుగెత్తుకొని వచ్చి యాసంగతి భర్తతోఁ జెప్పి,"నృపింహ స్వామి బోయి అన్నాళ్ళయినది; ఎప్పడును నాకీవలకు స్వప్నములో నైనను గనఁబడలేదు. ఇప్ప డీవిరుద్ధ మే'మని యాశ్చర్యపడఁ జొచ్చెను. ఇంతలో వీధితలుపువద్ద మరల గేకలు వినబడెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు భోజనముచేసి దీపము వెలిగించుకొని పోయి తలుపు తీసిరి. తీయఁగా నిజముగా నృసింహస్వామియే 'మామా' యని పలుకరించి, ఆయన చేయి పట్టుకొనెను. ఆయన యల్లునిఁ బ్రత్యక్షముగాఁజూచినను నమ్మక మరల మరల దేహమును పట్టి చూచి, పాదములు వెనుకవైపునకు తిరిగియుండక తిన్నఁగానే యుండుటవలన మాయ కాదని నిశ్చయించి యాతనిని లోపలికిఁ దీసి కొనివచ్చి భార్యతో మన నృసింహస్వామియే వచ్చినాఁడని చెప్పి, కాళ్ళు కడుగుకో నీళ్ళిమ్మని తొందరపెట్టెను. ఆమెయు దీపము దగ్గ రగాఁ దీసికొనివచ్చి మొగము పాఱఁ జూచి "నాయనా" యని కౌఁగ లించుకొని కన్నీరు నించెను. ఆమెనుజూచి యల్లుఁడును కన్నుల నీరు పెట్టుకొనెను. ఆ యుద్రేకమంతయు నడఁగిన మీఁదట,నృసింహ