పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాని చుట్టును విశాలమయిన యా యరుగు వేయించినాఁడు, ఆ యరుగుమీఁద చెట్టు నీడను గూరుచుండి గ్రామ కరణ మెప్పుడును పని చూచుకొనుచుండును. అప్పుడు ముప్పది సంవత్సరముల యీడు గల యొక నల్లని శూద్రుఁడు తెల్ల బట్టలు కట్టుకొని చంక మూటను దగిలించుకొని వచ్చి మీరేమయిన కాసులు పేరు గొనియెదరా?"యని యడిగెను. మా సవతి మేనమామ "ఏదీ చూపు" మని యడిగెను. ఆ శూద్రుఁ డరుగుమీఁదఁ గూరుచుండి మూటను విప్పి కాసుల పేరు తీసి యాతని చేతి కిచ్చెను. ఆతఁడు చూచి వెల యడిగి నా చేతి కిచ్చి బాగున్నదేమో చూడమని చెప్పెను. నేను దానిని చేతఁ బట్టుకొని నిదా నించి చూచి, కొలికిపూసనుబట్టి యానవాలుపట్టి రుక్మిణిదని తెలుసు కొని “నీ కీ కాసుల పేరు ఎక్కడనుండి వచ్చే' నని వానిని బ్రశ్న వేసి తిని. వాడు నేను వర్తకుడను కాబట్టి మా యూరిలో నొకని చేత పట్టుతో కట్టించినా నని చెప్పెను. అందుమీఁద నే నాపేరు మా బంధువులదని చెప్పి, "యీ దొంగసొత్తు నీయొద్దఁ గనఁబడినది కాబట్టి నిన్ను రాజభటుల కొప్పగించెద"నని బెదరించితిని. వాఁడును జడియక కాసులపేరు మా యొద్దనే దిగవిడిచి, "ఠాణాకుఁబోయి మీరు చేసిన యక్రమమును జెప్పి, మిమ్ములను బట్టుకొని శిక్షించుటకు బంట్రోతు లను దీసికొని వచ్చెద"నని కేకలు వేయుచుఁ బోయి, నే నచ్చట రెండు దినము లున్నను మరల రానేలేదు.

మూడవనాఁడు ప్రాతఃకాలముననే యొక కూలివాఁడు ధవళేశ్వరము నుండి వచ్చి నారాయణమూర్తిగారు వ్రాసిన జాబు నొక దానిని నా చేతి కిచ్చెను. నేను దానిని పుచ్చుకొని విప్పి చూచుకొను నప్పటికి "మీ నాయన నేఁడే గృహము తగులబడి కాలముచేసినాఁడు. కాబట్టి తక్షణము బయలుదేఱి రావలసినది" అని యందు వ్రాసి యుండెను. పిడుగువంటి యా వార్త చూడఁగానే గుండెలు బద్ద లయి లోపలికిఁ బోయి యేడ్చుచు నా సవతి తల్లి కాదుర్వార్తను విని పించితిని; ఆ మాట విన్నతోడనే యామె నేలఁబడి కొప్పు విడిపోవ దొర్లుచు ఱొమ్ము చఱచుకొనుచు నిల్లెగిరిపోవునట్లు రోదనము చేయ నారంభించెను. ఆ యేడుపులును పెడబొబ్బలును కొంచెము చల్లా