పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిచ్చుచుండెను. ఆరంభ దశయందు వచ్చిన సొమ్ములో మా నాయనకుఁ గూడ భాగమిచ్చెడివాఁడు గాని తాను పెద్ద వైద్యుఁడని పేరు పొందిన తరువాతను మా నాయనకు గ్రామములోని వారితో విరోధము వచ్చిన తరువాతను భాగమిచ్చుట మానివేసినాడు. అట్టివాఁడు మా నాయన స్వయముగా వెళ్ళి తన భార్యకు జబ్బుగా నున్నదని బ్రతిమాలి పిలిచినను ప్రజలకు వెఱచి యొక్కసారి చేయి యయినను చూచి పోయిన వాఁడుకాఁడు. వేయేల? ఊరివారు పెట్టవలసిన నిర్బంధముల నన్నిటిని బెట్టిరి: చీఁకటి పడిన మీఁదట ఇంటిమీఁద బెడ్డలు వేయ నారంభించిరి. నన్ను భార్యకుఁ గావలిపెట్టి మా నాయనయే చెఱువుకు బోయి స్నానముచేసి నీళ్ళు తెచ్చుకొని వంటచేసి పగలు రెండు జాములకు పథ్యము పెట్టుచు, మీరయిన గ్రామములోనున్నఁ దన కింత యిబ్బంది రాదు గదా యని మీరు చేసిన యుపకారములను దలఁచు కొనుచు బహువిధముల విచారించెను. బహు ప్రయాసముమీఁద కొన్ని దినములకు మా తల్లికి వ్యాధి నిమ్మళించినదిగాని దేహములో బలము మాత్రము చేరినది కాదు. గ్రామములో విరోధ మంతకంతకు ప్రబలి నది. తెల్లవార లేచి చూచువఱకు, మా వీధి గుమ్మము నిండ నశుద్ధ పదార్ధములను మనుష్యుల పుఱ్ఱెలను పడియుండుచు వచ్చెను. మా తండ్రి వాని నన్నిటిని దీసివేసి నిత్యమును రెండుమూడు స్నానములు చేయుచు భార్య కుపచారముగ తిన్నగా జరగ నందున నన్నామెవెంట నిచ్చి సవారిమీఁద పుట్టినింటికి హేలాపురము పంపి, తానొక్కఁడు నిల్లు కనిపెట్టుకొని యుండెను.

బయలుదేఱిన మఱునాఁడు రాత్రి నాలుగు గడియల ప్రొద్దు పోయిన తరువాత మేము సుఖముగా పోయి యేలూరు చేరితిమి. అక్కడఁ గొన్నాళ్లన్నమీదట పథ్యము వంటఁ బట్టుటచేతను తల్లి దండ్రుల యాదరణ చేతను నా సవతి తల్లి దేహము స్వస్థపడినది. ఒక నాఁడు నేనును నా సవతి మేనమామయు నుదయ కాలమున దంతధావ నము చేసికొని వీధిలో రావిచెట్టు చుట్టును గుండ్రముగా రెండడుగుల యెత్తుగా వేయఁబడియున్న యరుగుమీఁదఁ గూరుచుండి యుంటిమి. నా సవతితల్లి తండ్రి రావిచెట్టునకు వేపచెట్టునకు పెండ్లి చేయించి