పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నందున నేమని నిశ్చయించుటకు తోచక విభ్రాంతితో నాతని మొగమువంకనే ఱెప్పవేయక చూచుచు లోపలికి రాక యచ్చటనే నిలుచుండిరి. ఇంతలో సీత గుమ్మములోనుండి తొంగిచూచి, "అమ్మా! నాన్నగారు వచ్చినా" రని కేకవేసి వెళ్ళి తండ్రిని కౌఁగలించుకొనెను.

అంతట మాణిక్యాంబ పరమానందభరితురాలయి వెంటనే లేచివెళ్ళి కాళ్ళు కడుగుకొన నీళ్ళు తెచ్చియిచ్చి పాదముల తడి తన పయిఁటచెఱఁగుతో నొత్తి కూరుచుండుటకయు గోడదఱిని పీట వేసెను. రాజశేఖరుఁడుగారు పీటఁమీద గూరుచుండి సీతను ముద్దాడి తొడమీద కూర్చుండబెట్టుకొనెను. అప్పుడు మాణిక్యాంబ సీతమ దొంగ లెత్తుకొనిపోవుటయు, రామరాజు మఱియొకరును వదలించి తెచ్చుటయఁ జెప్పెను. రాజశేఖరుఁడుగారు రామరాజు పెద్దాపురాధి నాధులయిన కృష్ణజగపతిమహారాజు లనియు, ఆయన ప్రజల క్షేమ మును కనుగొనుటకయ యట్టి మాఱువేషములలో సంచరించుచుందు రనియు, రామరాజను పేరున వచ్చి మనకు బహూకారములను జేసి తుదకు కారబంధవిమోచనము జేయించిరనియఁ జెప్పి, తన్ను విడిపించిన క్రమమును వివరించి కొంతసేపు నృపుని సద్గుణవర్ణనమును జేసెను. మాణిక్యాంబ రామరాజు దేశాధీశుఁడని విని యాశ్చర్య పడి, ఆయనయొక్క గర్వరాహిత్యమును పరోపకార శీలతను బహు భంగుల మెచ్చుకొనెను.

ఇట్లు మాటాడుచుండఁగానే సుబ్బరాయఁడు వచ్చి రాజశేఖరుఁడుగారి కాళ్ళమీఁదపడి "నేను రుక్మిణి" నని చెప్పెను. ఆయన సంతోషముచేత కొంతసేపు మాటాడలేక, తుదకు హృదయము పదిలపఱచుకొని లేచి పెద్దకుమార్తెనాలింగనము చేసికొనెను.అప్పుడు చచ్చిపోయినదనుకొనుచున్న కూతురు లేచి వచ్చుటచేత నాదంపతుల కిరువరకును కలిగిన సంతోష మింతింతయని చెప్ప శక్యముకాదు. ఆ సమయమున సీతకుఁ గలిగిన సంతోషమును పట్ట శక్యముకాక పోయెను. ఆ యుద్రేకము కొంత నిమ్మళపడినమీదట, ఆ వధూ