పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

టకు శక్తిగలిగి యుండియు బ్రవర్తనమును బరీక్షించుటకయి యింత కాలము పేక్ష చేసితిమనియు చెప్పి, వెంటనే కారాబంధ విమోచనము చేయించిరి. రాజశేఖరుడుగారు కొంతసేపేమి పలుకుటకును తోచక కొంత భయము తీఱినవెనుక మెల్లగా యెలుగు తెచ్చుకొని, గద్దద స్వరముతోఁ "దేవరవారిస్థితి తెలియక సామాన్య మానవునిగా నెంచి యగౌరవముతోఁ జూచి నందునకును సీత వివాహ కార్యమునకు భంగము కలిగెనన్న కోపమున దూషణ వాక్యములు పలికినందున కును క్షమించి రక్షింపవలయు" నని బహుదీనత్వముతో వేడు కొనిరి. ఆ విషయమునఁ దమకెప్పడును మనసులో మఱియొకలాగున లేదని చెప్పి, రేపు పెద్దాపురమునకు వచ్చి తమ్ముఁ జూడవలసినదని సెలవిచ్చి రాజుగా రాయన నింటికిఁ బంపిరి.

ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు శోభనాద్రిరాజును బిలిచి యాతఁడు చేసిన నేరమున కెంత గొప్పదండనమునో విధింపవలసి యున్నను దయారసము పెంపున నెలదినములు మాత్రము చెఱసాలలోనుండ శిక్ష విధించి భటుల వశమున నొప్పగించిరి.అంతేకాక సీత నెత్తుకొని పోయినవారిని తాను పట్టి తెప్పించినప్పుడు నిజము చెప్పిన యెడల శిక్షలో గొంతభాగము తగ్గింపఁబడునని వాగ్దానముచేసి యుండుటంబట్టి వాండ్ర శిక్షలో సగము తగ్గించుటయేకాక మంచిరాజు పాపయ్యకు సహితము సగము శిక్ష తక్కువ చేసిరి. ఈ కార్యము లన్నిటిని జక్క బెట్టుకొని శ్రీకృష్ణజగపతి మహారాజాలవారు భద్ర గజారూఢులయి, వందిమాగధులు బిరుదు పద్యములు చదివి కొని యాడ, భేరీ మృదంగాది వాద్యములు బోరుకొలుప, చతురంగబల సమేతులయి తమ రాజధానికి విజయంచేసిరి.

రాజశేఖరుఁడుగారింటికి వెళ్ళునప్పటికి మాణిక్యాంబ పడమ టింటి గోడకుఁ జేరఁగిలఁబడి గూరుచుండి తల వంచుకొని సుబ్బ రాయునితో నేమో చెప్పచుండెను. రాజశేఖరుఁడుగారు గుమ్మము వద్దకు వెళ్ళి, ఆ చిన్నవాని ముఖ లక్షణములను పలుకుబడియు రుక్మిణిని పోలి యున్నందున నాశ్చచర్యపడి చూచి పురుషుఁడయి