పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/139

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట ఆమోదించబడ్డది


చుండిరి. రాజుగారప్పుడప్పుడు ధర్మోపన్యానములను సహితము చేయుచుందురు. లోకములో నెవ్వరెన్ని పాట్లుపడినను భోజనము నిమి త్తమే కాఁబట్టి, ఆ విషయమున నేమిచేసినను దోషములేదని వాదించుచుండిరి. ఈ సిద్ధాంతము మనస్సున నాటియుండుట చేతనే కాఁబోలును రాజుగారు ప్రతిదినమును లేచినది మొదలుకొని పది గడియల వఱకు పాత్రర్భోజనమునకు వలయు సంభారముల నిమి త్తమే ప్రయత్నము చేయుచుందురు; భోజనమయినది మొదలు కొని మధ్యాహ్నము ఫలాహార మేమిదొరకునా యని చింతించు చుందురు;ఫలాహారమయినప్పటినుండియు రాత్రిభోజనమునకు వ్యంజ నము లేవి కలవని యాలోచించుచుందురు.

ఈ రాకపోకలచేత రాజశేఖరుడుగారికి రాజుగారివద్ద మిక్కిలి చనువు గలిగెను. ఆ సంగతి నెఱిగి బ్రాహ్మణులు రాజశేఖరుఁడుగారి యింటికిఁ బోయి పలువిషయములు ముచ్చటించుచు, వారిలోఁ గొందఱు సీత నెవ్వరికిచ్చి వివాహము చేయఁదలఁచినా రని మాట వెంబడి నడుగుచుందురు. ఇప్పుడు చేతిలో డబ్బులేనందున, ఎవరికిచ్చి వివాహముచేయుటకు తలపెట్టుకోలేదని యాయన బదులు చెప్పుచుండును. ఒకనాడు రాజశేఖరుడుగారు భోజనముచేసి కూరుచుండి యుండగా బొమ్మగంటి సుబ్బారాయఁడను సిద్ధాంతి వచ్చి జ్యోతి శ్శాస్త్రమునందలి తన యఖండ పాండిత్యమును దానివలనఁ దనకుఁ గలిగిన గౌరవమును పొగడుకొని ఆంధ్రదేశమునందలి గొప్పవారంద ఱును జాతకములను తనకుఁ బంపి ఫలములను తెలిసికొనుచుందురని చెప్పి దానికి నిదర్శనముగా బెక్కు- జాతకచక్రములను విజయనగ రాది దూరప్రదేశములనుండి ప్రభువులు వ్రాసినట్టున్న జాబులను జూపి, ఫలము చెప్పుటకయి ఆయన యొక్క జన్మనక్షత్రమును కూడ తెమ్మని యడిగెను.

రాజ__నాకిప్పడు జ్యౌతిషశాస్త్రమునందలినమ్మకము పోయి నది; నావద్ద కొల్లగా ధనము పుచ్చుకొని వ్రాసిన మావాండ్ర జన్మ పత్రికలలో ఫలము లేవియు నిజమయినవి కావు; మేము కాశీయాత్రకు