పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుస్తకము నొకదానిని విప్పి సర్వదా ముందు పెట్టుకొని కూరు చుండును. మన పొరుగింట కాపురమున్న సముతుదారుగారి తల్లికి పురాణ మన్న నెంతో యపేక్ష; ఆమెకు నిద్రరానపు డెల్లను పురా ణము చదువమనును; పురాణ మారంభించినతరువాత మంచి కథ పట్టు రాఁగానే గోడను చేరగిలబడి హాయిగా నిద్రపోవును.

రాజ__ఇక్కడి వర్తకు లెటువంటివారు ?

సత్ర__వర్తకులు తమ సరుకులను మాత్రమే కాదు, మాట లను సహితము విశేషలాభమునకు విక్రయింతురు. అయినను వారి కెంతలాభము వచ్చినను, ఆ లాభము మాత్రము వారి యాశకుఁ దగి యుండదు. ఈ సంగతి నెఱిగి యిక్కడి పెద్దమనుష్యులు కొందఱు మొదట వారి వర్తకశాలకుఁ బోయి యొక వస్తువును గొని, వారడిగిన వెల నిచ్చివేయుదురు; ఆ పయిన చిన్నవస్తువు నొక దానిని ఆరవు తెప్పించి, దాని సొమ్మును మఱునాఁడే పంపివేయుదురు; అటు పిమ్మట క్రమక్రమముగా పెద్ద వస్తువులను దెప్పించి వాని వెలలను గూడ యు క్తసమయముననే యిచ్చివేయుదురు; ఈ ప్రకారముగా నమ్మకము కుదిరినతరువాత పెండ్లి పేరో మఱియొక శుభకార్యము పేరో చెప్పి విలువ వస్తువులను విస్తారముగాఁ దెప్పించి కడపట సొమ్మీయక యపహరింతురు.

రాజ__ధనము నిమిత్తము యీ ప్రకారముగా నక్రమమున కొడిగట్టిన కీర్తిపోదా?

సత్ర__కీర్తి కేమి? దానిని కొనుటకయి ముందుగా ధనము సంపాదించిన యెడల తరువాత నిమిషములో కావలసినంత కీర్తిని కొనవచ్చును.

రాజ__మీ రాజుగా రెంతో ధర్మాత్ములనియు ప్రజలను న్యాయ మార్గమున నడిపించువా రనియు ఎప్పుడును వినుచుందును. వారి రాజధానియైన యీ పట్టణమునందె యిట్టి ఘోరకృత్యములు జరుపు చుండఁగా రాజుగారు సహించి యూరకున్నారా?

సత్ర__ఈ పట్టణములో నిప్పుడేమి యక్రమములు జరుగు