పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/121

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట ఆమోదించబడ్డది


తొమ్మిదవ ప్రకరణము

రాజశేఖరుcడు-గారు పెద్దాపురము చేరుట_రుక్మిణి దేహమును వెదకవచ్చి కానక దుఃఖించుట_పెద్దాపురములోని వార్తలు _ భీమవరమునకుఁ బోవుట_ఆక్కడి విశేషములు_సుబ్రహ్మణ్య మును పీఠాపురము పంపుట,

  రామరాజు నాఁటిరాత్రి మెల్లగా రాజశేఖరుడుగారిని కుటుంబ సహితముగాఁ గొనిపోయి పెద్దాపురము చేర్చి, తిరుపతిరాజు చెఱువు నకు సమీపముగనున్న సత్రములో దింపి, కాశీప్రయాణము మాని భీమవరములో నుండఁడని బహువిధములఁజెప్పి యొప్పించి తన దారిని బోయెను. ఒక్కనాఁటి ప్రయాణములోనే కూఁతురుపోవుటయు తక్కినవారు బ్రాణములు దప్పించుకొని బయలఁబడినను కాళ్ళన్నియు వాచి యడుగుతీపి యడుగుపెట్టలేనంత దుస్థితిలో నుండుటయుఁ దలఁచుకొని యాత్ర పేరన్న భయపడి రాజశేఖరుఁడుగారు కొన్ని దిన ములలో; భీమవరముచేరి యందుండి సమయమయినవ్పడు రాజుగారిని చూచుటకు నిశ్చయించుకొనిరి. రుక్మిణిపోయినదన్నవిచారము చేతను మార్గాయానమున బడలియుండుటచేతను వా రారాత్రి వంటలు కొని భోజనముచేసినవారు కారు.వారికెవ్వరికిని కంటికి నిద్రయును పట్టలేదు. ఆ 

రాత్రి నొక యుగముగా వేగించి రాజశేఖరుడుగారు కోడి కూసిన తోడనే లేచి తామొక్కరును బయలుదేఱి రుక్మిణిని వెదకుటకయి వేడిమంగలపు మార్గమున నడచిరి.

అట్లు కొంతదూరము నడచి రాజశేఖరుఁడుగారు పసులకాపరి బాలుర నడిగి మార్గమును గనుఁగొనుచు అడవిలోఁ బ్రవేశించి, నాలుగు గడియల ప్రొద్దెక్కు వఱకు దొంగలు కొట్టిన స్థలముచేరి యక్కడ రుక్మిణిదేహమును గానక యిసుకలో నెత్తురు చుక్కలను

119