పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యొక దేశమున గనబడకపోవుటకు హేతువుండదనియు, రాజశేఖరుఁడుగారు బహుదూరము వాదించిరి. అక్కడ నున్న పండితు లలో నెవ్వరికిని యుక్తులు తోఁచకపోయినను, విశేషముగా కేకలు మాత్రమువేసిరి. అక్కడ నున్నవారి కా వాదమేమియు లేదు కనుక బిగ్గఱగా నఱచినందున శాస్త్రుల పేళ్ళవారే గట్టివా రని మెచ్చుకొని రాజశేఖరుడుగారి వాదము బౌద్ధవాదమని దూషించిరి. ఒకరిని వెక్కిరించుటవలనఁ గలుగవలసిన సంతోషముతప్ప మఱియొకవిధమైన సంతోషము తమకు లేదు గనుక, విద్యాగంధ మెఱుగని మూర్ధశిరోమణులు రాజశేఖరుఁడుగారిని బహువిధముల బరిహసించి పొందదగిన యానందమునంతను సంపూర్ణముగా నను భవించిరి. ఇంతలో గ్రహణమోక్షకాలము సమీపించినందున నెల్ల వారును విడుపు స్నానమునకై పోయిరి. శుద్ధమోక్ష మయిన తరు వాత ముందుగా స్నానము చేసివచ్చి యాఁడువారు వంటచేసినందున దీపములు పెట్టించి యెల్లవారును ప్రధమ భోజనములను జేసిరి.