పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

డేది. ఆ పోటీల్లో ఎన్నో మార్లు లక్మీనరసింహం గారు బహుమతి పొందారు. లక్మీనరసింహంగారు నవలల పోటీలో పాల్గొంటే మరొకరికి బహుమతి రాదన్న ప్రసిద్ధి కూడా ఆ రోజుల్లో వుండేదని, తామే స్వీయచరిత్రలో చెప్పుకున్నారు, ఆటువంటి చిలకమర్తి తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రాన్ని చూసే గ్రహించామని చెప్పకున్నారు, బాగా పరిశీలించి చూస్తే చిలకమర్తి తొలి నవల రామచంద్ర విజయానికీ, తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రానికీ చాలా పోలికలు కన్పిస్తాయి. వర్ణనలూ, సంఘ సంస్కార విషయాలూ, పాత్ర చిత్రణం, ఇంకా అనేక సందర్భాలలో యీ రెండు నవలలకూ దగ్గరి పోలిక లున్నాయి.

దీనినిబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే వీరేశలింగం పంతులుగారికి తరువాత నవలలు వ్రాసిన వాళ్ళందరూ ఆయనను ఆనసరించారు__ఆని, అందువలన వీరేశ లింగం పంతులుకి పూర్వమే నవలు వ్రాయటానికి గారికి కొందరు ప్రయత్నించినా, కొంత కృషి జరిగినా, వీరికి తరువాత వ్రాసిన వాళ్ళందరూ వీరినే ఆదర్శంగా పెట్టుకున్నారు. కాబట్టి, తెలుగులో యీ ప్రక్రియకు ఆయనే ఆద్యుడైనాడు. నవల ఆనబడే ప్రక్రియ కొక స్థితినీ, ప్రాచుర్యాన్నీ కలిగించినవాడూ ఆయినాడు. నన్నయ్య గారికి ముందే తెలుగు భాషా, ఆందునా పద్యరచనా వున్నా, నన్నయ్యే ఆదికవీ, వాగనుశాసనుడూ ఆయినట్లు వీరేశలింగమే నవలా రచనకు ఆద్యుడూ, ఆదర్శమూ ఆయినాడు, ఇంగ్లీషు భాషా ప్రభావంవల్ల, తెలుగులో కొత్త ప్రక్రియగా నవల రూపొందింది ఆనుకుంటే రాజశేఖర చరిత్రమే తొలి తెనుగు నవల ఆవుతుంది, రాజశేఖర చరిత్రం పూర్వం నవలలుగా వ్రాయబడిన వని చెప్పబడుతున్న వానిపై ఇంగ్లీషు ప్రభావం స్పష్టంగా లేదు, ముందుముందు ఇప్పడు మనం నవల ఆంటున్న పక్రియను, వచన ప్రబంధమనీ, ఆఖ్యానమనీ అనేవారు. తరవాత 'నవల' అన్నారు. నవల ఆనటంలో ఇంగ్లీషు