పుట:Raajasthaana-Kathaavali.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా సంగుఁడు,

79


డెవ్వరో ప్రచ్ఛన్న వేషుఁడని నమ్మి వాని జన్మవృత్తాంతాదికము నెఱిఁగింపు మని బలవంతపెట్టి యెఱిఁగించిన చోఁ దనకూఁతు నిచ్చి వివాహము చేసి రాజ్యము రావలసియున్న సాయము చేసి యిప్పించెద నని వాగ్దానముఁ జేసెను.

అప్పటికి సంగుని తమ్ముఁడు జయమల్లుఁడు నీచ మగుమరణమును బొందెను; కాని పృథివిరాజు మాత్రము మహోన్నతదశలో నుండెను. సంగుఁడు మొదటినుండియు దురదృష్టవంతుఁడే యగుటచే శ్రీనగరరాజు వానినిఁ జేరదీయుట కూఁతునిచ్చి పెండ్లి చేయుట సాయము చేయఁ దలంచుట 'మొదలగు వాత౯లు కర్ణాకర్ణికగ పృథివిరాజు నకుఁ దెలిసినందున నతఁడు తన యన్న గారిని బెద్దపులినిఁ దరిమినట్లు దరిమి చంపఁ దలఁచె. అంతలో దైవయోగమున సంగుని పున్నెము బాగుండ బట్టి పృథివి రాజు తన చెల్లెలి యాపదఁ గడువ బెట్టుటకుఁ బోయి తనకు మిక్కిలి ప్రియమయిన కమలమియరుకోటకు దిరిగి రాకయె దారుణమరణము నొందేనని వెనుకటి రాజు చరిత్రలోఁ జెప్పఁ బడి యున్నది. పృధివిరాజు గతించిన కొన్ని దినములకే తండ్రి యగు రాయమల్లుఁడు మహాదుఃఖభారము చేత గ్రుంగిపోయిన యామేను విడిచి పరమపదమును బొందెను. రాయమల్లుఁడు మివారు దేశమున కంత యెక్కువ యభివృద్ధిని దేలేక పోయినను మునుపున్న దానిఁ జెడ గొట్టకుండఁ గాపాడెను. రాయమల్లుఁడు కృపాళువై గౌరవనీయుఁడై రాజపుత్రులయం దుండఁగూడని శాంతరసమునకు స్థానమైయుండెను; కాని కొడుకులను వంచుకొన లేకపోయెను.

పితు రనంతరమున సంగుఁడు వచ్చి సింహాసనమెక్కి చారుణీదేవి యర్చకురాలి మాటయు గొల్లబోయని మాటయు నిశ్చయములుగా జేసి రణసింహుఁ డను పేరు వహించెను; రాజస్థానమునందే గాక యితర దేశ ములందును గట్టిరాజు గద్దె యెక్కెనని వెల్లడి యయ్యెను. మార్వారు, అంబరు, అజమిరు, బూందీ, గ్వాలియరు, కాల్సీ మోద