పుట:Raajasthaana-Kathaavali.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

రాజస్థానకధావళీ.

ఆసమయం రాజపుత్ర వీరులు విశ్వాసము గలిగి తన్ను సేవింప దినము లొకతర బడిగాఁ బుచ్చుచుండెను.

ఒక నాఁడు శ్రీనగరరాజు పరివారస మేతుఁడై ప్రయాణమున నలసి సొలసి మట్టమధ్యాహ్నమున నెండ కోర్వలేక యొకపెద్ద మఱ్ఱి చెట్ట క్రింద పండుకోనెను. సంగునకు వంట యందు నేర్పు కుదుర నందున దక్కినవా రందఱు వండుకోను చుండ నతఁడు వంట మాని యా చెట్టు క్రింద చల్లగఁ బండుకొనెను. అన్నమువండి వాని మిత్రులు దెచ్చునప్పటికీ సంగుఁడు కత్తి తలక్రిందఁ బెట్టుకొని గాఢముగ నిదు రించెను. ఆ మట్టి చెట్టు తోఱ్ఱలోనుండి, యొక మహాసర్పము వచ్చి సంగునితల వద్ద నిలిచి పడగవిప్పి వానితల కెండ సోఁకకుండ గొడుగు పట్టిన ట్లాడుచుండెను. ఆపాము పడగమీఁద చిత్రవణ౯ములు గల యొక పక్షి యవ్యక్తమధురముగాఁ గూయుచుండెను. ఆసమయమున నొక వెఱ్ఱి గొల్లఁ డా దారినిఁబోవుచు నిది యేమివింత చెప్పుమా యని నోరు తెఱచి రెప్ప వేయక చూచుచుండెను. తక్కిన రాజ పుత్రులు వానిదగ్గఱకు రాఁగానే సంగుఁడు మేల్కని కన్నులు దెరచెను. ఆగొల్ల బోయఁడు నేల పైఁబడి సంగునకు సాష్టాంగ నమస్కార మొనర్చి భయసంబ్రమములతో “భళి భళీ! ఈ బాబు గొప్ప రాజు కాఁగలఁడు. ఇంత ప్రభువు లోకములో లేడు.

ఆమాటలు విని సంగుఁడు తన రహస్యము వెల్లడి చేయుట కిష్టము లేక తాను వట్టి నిరుపేద ననియుఁ దన కట్టి యోగము పట్టదనియు వాదించెను. గొల్ల బోయఁడు వాని పలుకులు చెవిఁ బెట్టక తనకు పాములయొక్కయు పక్షులయొక్కయు భాషలు తెలియు ననియు నవి రెండు నిద్రఁబోవు వానికి మహా రాజ భోగముపట్టనున్నదని చెప్పుకొన్న వనియు దృఢముగాఁ బలికెను. సంగుఁ డప్పటికిని గొల్ల వానిమాటలు కల్ల యని నిరసించెను , కాని శ్రీనగరరాజు తనకు బంటై పనిచేయు చున్న రాజకుమారుఁడు నిజముగా బంటులా గుండక పోవుటచే నతఁ