పుట:Raajasthaana-Kathaavali.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా సంగుఁడు.

77


ధగ ధగ లాడు నతనిశరీరచ్ఛాయనుబట్టి యతఁడు కాపువాడను కొనుటకు వీలు లేదు.

రాయమల్లుఁ జ్యేష్ఠకుమారు: డగుసంగుఁడు వాఁ డట్లో, మఠమువద్ద నొక రాజపుత్ర వీరుని సహాయమున నెట్టెటో ప్రాణములు దక్కించుకొని యావలకు దాఁటి మహారాజ కుమారునికోఱ కెవ్వఱును పశువుల కాపరుల యిండ్లు వెదకరని నమ్మి గొల్ల వాండ్రతో గలిసి మెలసి కాలక్షేపముఁ జేయు చుండెను. తాను నమ్మిన గొల్లలే తన్ను లేవఁ గొట్టినప్పుడు పట్టుట కాయుథము తినుట కన్నము తలఁ దాచుకొనుటకు పంచ కష్టసుఖములు జెప్పుకొనుటకు మిత్రుఁడు లేని విదేశములో నిఁక నెట్లు బ్రదుకునాయని సంగుఁడు విచారింపఁ జొచ్చెను. అట్లు విచారించుచు నతఁ డేమియుఁ దోఁచక నడవులం దిరుగుచుండ నొకనాడు కొందఱు గుఱ్ఱపు రౌతులు వాని కగపడి వెంటనే గుఱ్ఱములనుండి దిగి వినయమున వానిపాదముల పైఁ బడి నమస్కరించిరి, శరీరమునకు గాయపుమచ్చలు కొంత మార్పు దెచ్చి నను ఆవిశాలలోచనములు ఆచక్కఁదనము నొకమాఱు చూచినవా రెవ్వ రతనిని మరచిపోరు. అందుచేతనే కనఁబడిన రాజపుత్ర పరు లాతఁడు తమకు ముందు రాజగు నని గ్రహించి సంగుని గౌరవించి “అయ్యా ! మీరు బ్రతికియున్న వాత౯ వృథీవి రాజు విన్న పక్షమున మీకపాయము గలుగును గనుక మేము మీరహస్యమును వెలిపుచ్చము; కాని మేము మిమ్ము విడువక సేవించు చుందుము. ఈ ప్రాంతములకు సింహస్వప్నముగా నున్న శ్రీనగర రాజు యొక్క, కొలువులో మే మున్నాము. మీరుకూడ నారాజును కొలుతు లేని మీకుఁ గావలసిన యాయుధములు గుఱ్ఱము నిప్పించెదము.” అని వారు పలుకుటయు. దాను బాగుపడుట కింతకన్న మంచిసనుయము దొరక దని నిశ్చయించి సంగుఁడు శ్రీనగరరాజు కొలువు నంగీకరించి