పుట:Raajasthaana-Kathaavali.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

రాజస్థానకధావళి


భార్య పలుకులు పెనిమిటి 'మొదట సరకు చేయలేదు. కాని పిమ్మటఁ గొన్ని నాళ్ళకవియే నిశ్చయము లయ్యెను. ఏలయన సరిగా న డువనైన లేని కుఱ్ఱవాండ్రు కఱ్ఱపుచ్చుకొని యదలించినంత మాత్రమున గడగడ వడఁకి దారినిఁ బోయి దారిని వచ్చుమోట పశువు లాక్రో త్త కాపరిని లక్ష్యము చేయక విజృంభించి తిరుగఁ జొచ్చెను, యజమానుఁ డా సేవకుని తెలివి తేటలు గని పెట్టి యతఁ డందుకు పనికి రాడనియాపని లోనుండి తప్పించి యింటి పనులు సేయుమని వానిని నియోగించెను. అతని దురదృష్ట మేమోకాని యాతఁ డింటిపనులకుం బనికి రాఁడయ్యె ఒకనాఁడు యజమాని ని భార్య రోట్టెలు కాల్చుచు తానేదో మఱియొక పనిమీదలోనికిం బోయి యవి మాడిపోకుండా జూచుచుండుమని సేవకున కానతిచ్చెను. సేవకుఁడు సరేయనియామాట మరచిపోయి పరధ్యానముగా నుండునప్పటి కంతలో రొట్టలుమాడి బొగ్గులయ్యెను ఆపూట భోజనము బుద్ధి లేని సోమరిపోతు మూలమనిష్కారణముగిఁ జెడిపోయె గదాయని యజమానుని భార్య యేగాకయిం టిలో నున్న వారందఱు వానిపై మండిపడి "రొట్టెలు కమ్మగా వేగినప్పుడు పొట్టబద్దలగు నట్లు తినుటకు నీవు నోరు తెరవఁగలవు గాని యవి మాడిపోవుచున్నవేమో చూచుటకుఁ గన్నులు తెరవలేవు. నీవు మా కక్కర లేదు. నీ యిష్టమువచ్చిన చోటికి బొ" మ్మని చెప్పిరి.

ఆమంద భాగ్యఁ డామాటలు పడి బదులు చెప్పక యాయిల్లు విడిచి మెల్లఁగ నవతలకు నడ చెను. పశువుల కాపరిగను వంటలవాడు గను పనికి రాకున్న నతఁడు తెలివి తేటలు లేనివాఁడు కాడు. అతని శరీరము సుందర మయ్యు దృఢమయి చాకచక్యము కలదియు కష్టమున కోర్చునదియునై యుండెను, రాజపుత్ర దేశ మందుఁ బుట్టిన వాఁ డెవ్వఁడు చేత నాయుధము లేక సంచరింపఁడు. ఈ పురుషుఁడు నిరాయుధుం డగుటయేగాక నిర్భాగ్యుఁడై దారిద్య్యమును వెళ్ళఁబోయు చుండెను,