పుట:Raajasthaana-Kathaavali.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృధివిరాజు సాహసములు.

75

వారిరువురచే నోడింపఁబడి రణముఖంబున ప్రాణములు విడిచిన శూరశిఖామణి. చిత్తూరు రాజకుమారుఁడగు నీ పృథివి రాజును ఢిల్లీచక్రవతి౯ యగు నాపృథివిరాజని చదువరులు భ్రమ చెందఁదగదు. కాలాంతరమందా పృథివిరాజు చరిత్రముగూడ ప్రకటింపఁబడును.



రాణా సంగుఁడు.


పదునారవ శతాబ్ద ప్రారంభమునందు మేవారు సంస్థానము నందొక మారుమూల నొక గ్రామమున బీద కాఁపు కుటుంబ మొకటి యుండెను. ఒక చిన్న మేఁక లమంద నాలుగు కాళ్ళ పశువులు కట్టుకొను ముతక గుడ్డలు మొదలగునవి తక్క వారి కితర సొత్తేమియు లేదు. ప్రపంచమునం దెంతటి దరిద్రులున్నను వారికన్నదరిద్రులు కొందఱు కనఁబడుచునేయుందురు. ఆకుటుంబయజమాని యొకనాడు పోలము నుండి వచ్చుచుండ దారిలో చినుగు గుడ్డలు కట్టుకొని యన్నము లేక మలమలామాడుచున్న యొక కొత్త మనుష్యుడు వాని కగుపడెను. పశువులఁ గాచుట 'కెవని నైన నొక సేవకునిఁ 'బెట్టుకొనుట కది వరకే యోచించు చుండుటచే నతఁడీ క్రోత్త వాని నా పనియందు నియోగించెను. ఆకాఁపువాని భార్య యీ సేవకుని దెచ్చుట కిష్టపడక కొంచెము సణుగుకొని యిట్లనియె. . బ్రాహ్మణులకు బిచ్చగాండకునన్నము పెట్టుట పున్నెముగానీ తక్కినవాండ్రకు దానము చేసిన నేమిలాభము. దేశములో దుర్మార్గుల నేకులు పనిపాటలుమాని తిరుగుచుందురు. ఈమహానుభావుఁ డెంతటివాఁడో మన 'మే మెఱుగుదుము? అదిగాక పశువులను మేపుటమాత్ర మంత పైపై నున్నదా? ఆపని యందఱు జేయఁగలరా? చిన్నప్పటినుండియు యలవాటు పడిన కుఱ్ఱవాండ్రకె లొంగునుగాని పశువులు క్రోత్త వానిని దరికిఁ జేరనిచ్చునా? ఈమను ష్యుని వలన మన పని యగునని తోఁచదు."