పుట:Raajasthaana-Kathaavali.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు,

73


జల్లార్పగోరి నిద్రించుచున్న మరఁది మీఁదికి ఖడ్గము నెత్తెను. తన యన్న మగనిం దెగటార్చుటకు నుంకించుట జూచి యాబాలిక మహా పతివ్రత యగుటచే నట్టి క్రూర కార్యమున కిష్టపడక సోదరుని వారించి భత౯ ప్రాణముల రక్షించెను. ఈకళవళములో సిరోహిరాజు మేలు కాంచి యమదూతవలె నెదుట నిలిచిన బావంజూచి భయముచే వడఁకుచుండ పృథివి రాజు వాని నుద్దేశించి యిట్లనియె. 'నీవు మా చెలియలికిఁ గావించిన పరాభపమునకుఁ దగిన ప్రాయశ్చిత్తంబు జెప్పెదవినుము. నీ వామె పాదములంబడి వేఁడుకోని యామె చెప్పుల నీ తలం దాల్చితివా నిన్ను రక్షించెద. లేనిదో నొక్క యేటుననిన్నుఁ గడతేర్చెద, నని గంభీర నాదముతోఁ బలుక నానల్ల మందు పిఱికి చేయున దేమియు లేక ప్రాణభయంబున నాపని కొడంబడి యట్లు చేసె.

తన చెప్పించొప్పున నతఁడు కావించినతోడనే పృథివి రాజు మరదిం గౌఁగిలించుకొని వారిపై నెవరు కలిగి యాదరింప వారిరువురు కలసిమెలసి సౌహాద౯మున నుండిరి; కాని రాచకొమరునకు భార్య చెప్పులు నెత్తిని దాల్చుటకన్న నెక్కుడవమానము లేదు. కనుక సిరోహి రాజుహృదయమున నీ పరాభవాగ్ని రవులుచుండె. పందయగుటచే నప్పుడేమియుఁ జేయలేక యతఁడు సమయమునకయి నిరీక్షించుచుండె. పృథివి రాజు రాచనగరు దొంగతనముగాఁ బ్రవేశించినను రాజుగారికి స్నేహపాత్రుఁడై విందూల నారగించుచు మహానందమున కొన్ని దినము లచ్చటపుచ్చి తన కమల్మియగు కోటకు బోవ బయనమై మరఁదిని వీడుకొనియె, సిరోహి మంచి మంచి మిఠాయిలకు ప్రసిద్ధి కెక్కిన దగుటచే రాజు మాగ౯ మధ్యమున దినుమని పృథివిరాజునకు గొన్ని భక్ష్యముల నొసంగె.

పృథివి రాజు తనపై తనతండ్రి పైఁ గత్తి కట్టిన పినతండ్రి శిబిరమునకు బోయి నిర్భయముగ నిశ్శంకముగ నన్నముతిన సాహసికుఁ డగుటచేఁ దన బావయిచ్చిన భక్ష్యములనుగూడ మనంబున నేయను