పుట:Raajasthaana-Kathaavali.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

రాజస్థానకధావళీ,


గాయముల గుట్టించుకొను చుండెను. అప్పుడు పృథివిరాజు మెల్లమెల్లగ శిబిరముం జొచ్చి సైనికులచేఁ జిక్క కుండ పినతండ్రి గుడా రమునకు వచ్చి వానిక ట్టెదుట నిలిచెను. 'వానిం జూచి సురేశమల్లుఁడు భయవిస్మయములతో బలిమిని లేచెను. లేచునప్పటి కదివఱకు కుట్టిన గాయములన్నియుఁ బటాలున బగిలి నెత్తురులం గ్రక్కఁజొచ్చె. పృథీవీరాజు వానిసంబ్రమము వారించి భయము లేదని సేమ మడి గెను. సురేశమల్లుఁడును "నాయనా! సుఖముగానున్నాను. నీరాకచే మఱింత సుఖము గలిగినది సుమీ" యని కుమారునకుఁ బ్రత్యుత్తర మిచ్చెను. పిదప పృథివిరాజు నేను మిక్కిలి యాఁకలిగొనియున్నాను నిన్నెప్పుడు చూతునో యెట్లుచూతునో యని బెంగగొని మాతండ్రి నైనం దర్శింపక యన్నమైనం దినక నీతావునకు వచ్చితిని, నాకించుక యన్నము బెట్టింపు' మని పినతండ్రిని బ్రార్థించె. సురేశమల్లుఁడు నన్నము తెప్పింప పగలెల్ల నొకరిప్రాణముల నొకరు దీసికొనుటకై ప్రయత్నము చేసిన యారాచకొడుకు లిరువురు నారాత్రి జుట్టరికము నెయ్యము మెరయ కలసి మెలసి భుజించిరి. అనంతరము పృథివిరాజు పినతండ్రితో , "రేపు మనకయ్యమును ముగింపవలయు" నని పలుక “నాయనా! పెందలకడ రమ్ము పొ” మ్మని సురేశమల్లుఁడు బదులు చెప్పి వానిం బుచ్చె.

మరునాఁ డుదయమున యుద్ధ మారంభ మయ్యెను. ఆకయ్యమున నెప్పటిఁయట్లు పృధివిరాజే జయమునందె. సారంగ దేవుఁడును సురేశ మల్లుఁడును యుద్ధభూమి విడిచి పలాయతులైరి. పృథివిరాజు వారిం దరుముకొనిపోవ నెడనెడ చిన్నచిన్ని పోరాటంబులు జరుగు చుండె, వానిలో సయిత మెప్పుడు పృథవిరాజే విజయమునందుచు వచ్చె. ప్రళయాంతకునిఁబోలు రాచకుమారుని దాడి కోడి సురేశమ ల్లెట్టకేల కొకయడవిం జొచ్చి యందు నట్టనడుమ దుర్భేద్య మగు నొకప్రదేశము నెలవుగాఁ జేసికొని పగతురకు తమజాడలు తెలియ