పుట:Raajasthaana-Kathaavali.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

రాజస్థానకథావళి.


నాతండ్రి కెవడు మరల రాజ్యము సంపాదించి యిచ్చునో యతఁడే నాపాణిగ్రహణము సేయుగాక" యని యుత్తగ మిచ్చెను.జయమల్లుఁ డట్లు చేయుదు నని ప్రమాణము చేసి నమ్మిక వొడమునట్లు సంచరించి 'తారా దేవినిం జూడగోర నామెతండ్రి దాని కంగీకరించె. వా రుభయులు పరస్పరసందర్శనము చేయువేళ జయమల్లుఁ డామె చక్కఁదనమును జూచి పరవశత్వముఁ జెంది మతిభ్రష్టుఁ డౌటచేతనో లేక రాజవుత్రు లందఱు మైకము నిమిత్తము ద్రాపు నల్లమందు మద్దతు మితిమీరఁ ద్రావుట చేతనో యామె గౌరవమునకుఁ దనగౌరవము నకుఁ దగనట్లు వతి౯౦చి యా బాలిక నవమానించే వెంటనే యభిమాననిధియగు నామెతండ్రి ఖడ్గపాణియై వచ్చి జయమల్లుని నిలుచున్న వానిని నిలుచున్న యల్లే ఖండించి వైచె.

జయమల్లుని మరణవాత౯లు రాయమల్లుమహా రాజునకుఁ దెలిసినప్పుడు వాని కొలువునందున్న రాజపుత్రు లనేకులు కోపోద్దీ పితులై తారాదేవితండ్రినిం దెగటార్చి పగ దీర్చుకొనక తప్పదని రాణాతో విన్నవించిరి. రాణా వారిని వారించి యిట్లనియె. రాజ్యమును గోల్పోయి నిలువ నీడ లేక మనయండనుండి యెట్టెటో కాలక్షేపము సేయుచున్న యారాజున కంత యవమానము చేసిన వాఁడు నాకొడుకై నను జావవలసిన వాఁడే, మాన రక్షణమునకై యీసాహస మొనర్చిన యారాజు శౌర్యమునకు మెచ్చి బదనూరుభూముల నతనికి బహుమానములుగ నిచ్చుచున్నాను.

అంతం కొన్ని నాళ్ళకు పృథవిరాజు తనసోదరుని మరణమును తారా దేవి యొనర్చిన ప్రతిజ్ఞయు విని సత్వరంబుగ బదనూరునకువచ్చి తన్ను వివాహమాడుమని యామెనడిగేను. తనతండ్రిని రాజ్యప్రతిఫ్లితునిఁ జేయువానినేగాని వివాహమాడ నని యామె యెప్పటియట్లఁ బలుకుటయఁ బృథివిరా జట్లుచేయుదునని శపథము చేయ వాని సాహసములయందు నమ్మిక గలిగి తారాదేవినిచ్చి యామెతండ్రి యతనికి