పుట:Raajasthaana-Kathaavali.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు.

61


బారిపోవుచుండెను. అతఁడు వచ్చు దారిలోనే చెట్ల చాటున దాఁగి యున్న పృథివిరాజు తన పన్నినకుట్ర నిర్విఘ్నముగ నెఱువేఱినందుకు సంతసించి పఱుగెత్తుచున్న మీనరాజును బట్టుకొని బల్లెముతోఁ బొడిచి వాని కష్టము నంతము నొందించెను. పిన్ముట మీన రాజు పరిజనులు కొంత యాగడము సేయ పృధివిరాజును వానియనుచరులును వారినోడించి పట్టణము పరశురామప్రీతిఁ గావించి 'దేశమును స్వాధీనముఁ జేసికోనిరి. పృధివి రాజు తా నప్పుడు సర్వస్వతంత్రు డయ్యు నా దేశమునకు రాజగుట కిష్టము లేక యోజుని దానికిఁ బాల కునిగాఁ నియమించి తనతండ్రి పేరనే పాలింపు మని వానికిఁ జెప్పి తన కక్కడ కాలు నిలువకపోవుటచే ననేక సాహస కార్యముల, నింక నొనర్చి ప్రఖ్యాతిం గాంచవలయు నని గద్వారు విడిచి యనుచర సమేతుఁడై యన్య దేశములకుఁ బోవ నిశ్చయించుకొనెను.

ఆకాలమున మీవారు రాజ్యమునందనలి బదనూరు పట్టణములలో రాజ్యబ్రష్టుఁ డైన యొక రాజపుత్ర ప్రభు వుండెను.అతని రాజధాని తోడా యను పట్టణము. అతఁ డోక తురకరాజువలన జయింపఁబడి యూరువిడిచి తల దాఁచుకోనుటకు బదనూరునకువచ్చి మరలఁ దన రాజ్యమును దాను సంపాదించుకోనుట కనేక పర్యాయములు సేవకులఁ బంపి విఫలప్రయత్నుండై యూరకుండెను. ఆరాజునకు తారాభాయి యనునొక చక్కని కూఁతురు గలదు. ఆ బాలిక సూర్యరశ్మి రాని యంతఃపురములఁ గూపస్థ మండూకమువలెఁ బడియుండుట కిష్టము లేక ఘోషావిడిచి విల్లువంచుటయుఁ గత్తిదూయుటయు గుఱ్ఱపు నవారు చేయుటయు ఫాజులం గూర్చుకుని కయ్యములు నడపుటయు నేర్చి తండ్రిని మరల రాజ్య, ప్రతిష్ఠితునిఁ జేయ నిచ్చగించె, ఆవన్నెలాడి చక్కఁదనమును సాహసమును విని జయమల్లుఁడు తనకా కన్నియ నిమ్మని తండ్రికి సందేశ మంపెను. ఆమెతండ్రి యామాట కుత్తరమును దా నియ్యక యాపని కూతురు మీఁదనే పెట్టఁగా నామె