పుట:Raajasthaana-Kathaavali.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు,

57


సోదరు లంగీకరించి సురేశ మల్లునితో వ్యాఘ్రగిరికిం బోయిరి. అత్తరి నమ్మవారి యర్చకురా లచ్చట లేనందున నామె వచ్చువఱకు వారందు నిలువ నిశ్చయించిరి. పృథివిరాజును జయమల్లుఁడు నాయర్చకురాలి మంచముమీఁదఁ గూర్చుండిరి. సంగుఁడు 'నేలఁబరచిన యొక సివంగిచర్మము పైఁ గూరుచుండెను. సురేశమల్లుఁడు వానిప్రక్కనే మోకాలు సివంగిచర్మమునకుఁ దగులునట్లు నేలఁ గూర్చుండెను. అంత గొంతసేపటి కర్చకురాలు వచ్చుటయు ముందుగా పృథివిరాజు లేచి తమవచ్చిన పని నామె కెఱింగించెను. ఎఱిఁగించుటయు నామె సంగునివంకఁ దిరిగి యిట్లనియె.

"సివంగి చర్మమే పూర్వము రాజులకు సింహాననము. దానిని నీ విప్పు డధిష్ఠించితివి గనుక ముందు మీవారుసింహాసనమును నీవ యధిష్టింపఁ గలవు " అని పిదప సురేశమల్లునివంకఁ దిరిగి యనేక సంవత్సకములు బహుశ్రమల ననుభవించిన వెనుక నీకును దేశమును బ్రభుత్వముమ లభింపఁగలవు. అవి యెట్లనిన నింకఁ గొంతకాలమునకు పితృవిహీనుండగు నొక రాజకుమారుని బగతుక బారింబడకుండఁ దల్లి సంరక్షించు చుండును. ఆమె కతంబున నీకు రాజరికము లభించునని మోగ మాటము విడిచి పలికెను.

అపలుకులు నిని పృధివిరాజు మండిపడి పట్టరాని బిట్టలుకయు నీర్ఘ్యయుఁ తన్నుంబురికొల్పం గత్తిం దూసి సంగుని జంపుటకై వాని మీఁద దుమికెలు. అంతలో సురేశమల్లుఁ డడ్డువడి సంగుని రక్షింప వారలకు మహాకలహము సంభవించే. ఆయర్చకురాలును మిక్కిలి భయపడి తన నెక్కడ చుంపుదురో యని గుహవిడిచి పారిపోయెను. ఆమె చిన్న గుహ రాజపుత్రుల దూషణ భూషణములతోను ఖద్గసంఘ ట్టనములతోను ప్రతిద్వనుల నిచ్చెను.

అదినమున వ్యాఘ్రగిరికి సమీపమున నొక మఠమువద్ద రహతురు వంశస్థుఁ డగు నొక రాజపుత్రుఁడు గుఱ్ఱముపై జీను వేసికొని యెక్కడికో పయన ముగుటకు సిద్ధముగ నుండెను. అప్పుడు వాని యొద్దకు నొక పురుషుడు తన గుఱ్ఱమును మిక్కిలి వేగముగాఁ బరు