పుట:Raajasthaana-Kathaavali.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

రాజస్థానకథావళీ,


వేషము వేసికొని పని చేసినట్టె చేసి దానిగు ట్టేఱిఁగితిని. తక్కినచోట్ల కోట దుర్భేద్యమే కాని యొక్క మూల వీలుగ నున్నది. ఏకష్టము పడి యైన నొక్కసారి మనము కోటమీఁది కెక్కఁగలిగితిమా యింకకోట మన స్వాధీనమె. ఏలయందు రేని కావలివాండ్రు కోట దుర్భేద్యమను తలంపున నశ్రద్ధతో నున్నారు."

ఈకథ చెప్పునప్పు డతఁడు ప్రజల మొగముఁ జూడలేక తల పై ముసుగు వేసి కోనెను. మీవారు మార్వారు ప్రభువులు గుఱ్ఱముల పైఁ గూరుచుండియే వానిపలుకులు విని “సరే! యాకొండమీదికి దారి జూపగలవా'యని యడిగిరి. చిత్తము స్వామా యని యతఁ డను మతించుటయు మెఱి యలవంటిబంట్లను కొందఱఁ గూర్చుకొని మార్వారు రాజకుమారుఁడు వాని వెంటఁ జనియెను. మొదట సుజాయుఁ బిదప మార్వారు ప్రభువును జీఁకటిచాటునఁ బర్వతశిఖరమున కెగఁ బ్రాఁకిరి. ఆరాత్రి యాకాశమంతయుఁ గారుక్రమ్మిన మబ్బులతో నిండియుండుటచేఁ జిమ్మచీఁకటి యెల్లెడల వ్యాపించె. ఆకసము చిల్లి పడినట్లు వాన ద్రిమ్మరింపఁ జొచ్చే. బ్రహ్మాండములు పటపట పగులునట్లురుములు మెఱయసాగె. కన్నులు మిరుమిట్లు గొలుపునట్లు తళుకు తళుకు మని మెఱపులు 'మెఱయఁ జొచ్చె. సకలఘాతుక జంతువులకు శరణ్యమైన యాకోండ పై నారాత్రియం దాశూరశిఖామణులు కన్నుకన్ను గనఁబడని చీఁకటిలో ముం దేమి యున్నదో యెఱుఁగక వ్రేలు మోపుటకు తావు దొరకిన నందు నిలుచుచుఁ జేతి కేది దొరకిన దాని నూఁతగా బట్టుకొనుచు మెఱపు కనఁబడినపుడెల్ల దారిఁ జూచుకొనుచు నిరుకు సందుల గొందులఁబడి నడువసాగిరి. చీమ చిటిక్కు మన్న నొక బొమ్మ రాయి గదలిన యట్టిచిన్నయలుకు డైనఁ బగతురఁ దమజాడఁ దెలిసికొని కార్యవిఘ్నముచేయుదు రన్న భయమున నొండోరులతో మాట లాడుకోనక ధైర్యమునిమిత్త 'మొండొరులఁ బ్రోత్సాహముఁ జేసికొనక జారిపడినం బరస్పరసహాయ మడుగక యావీరు లాపర్వతశిఖరముల