పుట:Raajasthaana-Kathaavali.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా కుంభుఁడు

47


దోలుటలోను స్వరాష్ట్రమును బలపఱుచుకొనుటలోను మిక్కిలి సమర్థుఁ డయ్యెను. అతనికోడుకు కుంభుఁడు తండ్రి మరణమునాఁటికి బాలుఁడయ్యు బుద్ధిమంతుఁ డగుటచే దూరపుటాలోచన చేసి తన తండ్రికిఁ బ్రాఁత పగతుఁడును 'మేనమామయు నగుజోడాను తనసహా యార్థము రమ్మని వర్తమాన మంపెను. జోడాయు వెనుక వైరము మఱచి దయాళుఁ డై కుంభునికి సహాయము నిమిత్తము కొంతసేన నిచ్చి తనకుమారుని బంపెను. అతఁడును చిత్తూరురాణాయుఁ గలిసి రాజద్రోహు లగునన్నదమ్ముల నిరువురను స్థిమితముగ నొక్కచోట నిలుపనీయక యొక తావుననుండి యొక తావునకుఁ దఱిమి కొట్ట నెట్టకేలకు కాచమేరులు వారి బారి కోడి ప్రాణభీతిచే రాటకోట యను నొక కొండకోటం బ్రవేశించిరి. ఈదుర్గము నట్టడవులలోఁ గొండల పై నుండుటచే దుర్గమ మనియు మీవారు ప్రభువును నూర్వారు ప్రభు వును దానిం బట్టుకొనఁజాల రనియు నిశ్చయించి కాచమేరులు దానం బ్రవేశించి మరమ్మతు చేసి బలపఱచిరి.

కాచమేరుల జాడలు దెలియుటకై మీవారు, మార్వారు ప్రభువు లొక నాఁ డడవులలోఁ దిరుగుచుండ నొక మనుష్యుఁడు వచ్చి వారి పాదముల పైఁ బడి న్యాయము దయచేయుఁడు మహా ప్రభూ యని ప్రార్థించెను. నీవృత్తాంత మేమి యని వారడుగ నతఁ డిట్లనియె. “స్వామీ ! నేను రాజపుత్రుఁడను చోహణవంశస్థుఁడను. నా పేరు సుజా; నాకు చక్కని చుక్క యగునొక కూఁతురు గలదు. ఈ కొండలం దిరుగుచు నొకమారు కాచమేరులు నాముద్దుకూఁతును జూచి దాని నెత్తుకొని రాటకోటకుం బారిపోయిరి. నాదుర్గతిని గూర్చి నేను రాణా వారితో మొర పెట్టుకొనుట కిప్పుడే పోవుచుండఁగా నా యదృష్ట వశమున మార్గమధ్యమున మీరే యగ పడిరి, రాటకోట లోకు లను కొనునంత దుర్భేద్యము గాదు. దాని యాయువుపట్టు నే నెఱుఁగుదును. ఈనడుమ కోట మరమ్మతులు జరిగినప్పుడు నేనొకకూలివాని