పుట:Raajasthaana-Kathaavali.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

రాజస్థానకధావళి.


మేరులతల్లి భేటసింగునకు నగ్ని సాక్షిగా వివాహమైన ధర్మపత్ని గాక యుంపుడుకతైయై పేద యగువడ్లబత్తునికూఁతు రగుటచే వారు సంస్థానమందుఁ జండుని తరువాత గౌరవనీయు లయ్యుఁ గొంచెము తక్కువగఁ జూడఁబడు చుండిరి. ఆయన్నదమ్ము లిరువురు తమవడ్ల బత్తుల చుట్టరికపుమాట యెవరుఁ దలపెట్టినను మహాకోపోద్దీపితు లగుచు వచ్చిరి. ఈసంగతి రాజుకొలువున నున్నవారి కందఱకు విశదము.

మహారాణా యగు ముకుళుఁ డొకనాడు కొందఱు బందిపోటు దొంగల దఱిమికొట్టుచు విశ్రాంతికై యొక మామిడితోఁపులో దొరలందఱుఁ గొలువఁ గూరుచుండెను. అదివఱ కెన్నఁ డతఁడు చూచి యెఱుఁగని యొక చెట్టక్కడ కనంబడుటచే ముకుళుఁడు దాని పేరేమని దగ్గర నున్న యొక దొర నడిగెను. ఆదోర తనకును గాచమేరులకును మనస్పర్ధ లుండుటచే వారి నవమానము చేయుటకై యామ్రాని పేరుఁ దా నెఱుఁగనట్లు నటించి వారి నడుగుమని రాజుతో మెల్లఁగఁ జెప్పెను. రాణా యందలికిటుకు నెఱుఁగక పినతండ్రుల బిలిచి యావృక్షముపే రడిగెను. ఆయన్న దమ్ము లిద్దరు వెంటనే తాము వడ్లబత్తుని సంతతి యగుటచేఁ జెట్ల యొక్క పేళ్ళు నాణెములుఁ దమకుఁ జక్కఁగఁ దెలియు నను నర్థముతో రాజా ప్రశ్న తమ్మవ మానించుటకయి యడిగె నని మహాకోపోద్దీపితు లై యప్పటి కూరకుండి సాయంకాలము రాణా జపము చేసికొనునప్పుడు కత్తుల దూసి వాని పైఁ బడి తుత్తునియలుగా నఱికి చిత్తూరుకోటం బట్టుకొనుటకు నప్పుడ గుఱ్ఱముల నెక్కి పోయిరి. కోట కావలివాండ్రు జాగరూకత గలవా రగుటచే వారి ననుమానించి తలుపులం దెరువరైరి.

ముకుళుని దుర్మరణవార్త తెలిసినతోడనే ప్రజలు హాహాకారములు చేసిరి, ముకుళుఁడు చిర కాలము రాజ్య మేలకున్న 'నేలినన్ని నాళ్లు న్యాయముగాఁ బ్రజా పాలనము చేయుచుఁ బగతురఁ బారఁ