పుట:Raajasthaana-Kathaavali.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

రాజస్థానకథావళి.


మిచ్చిరి. ఆకావలివాండ్రకు దృప్తిపఱచి యతఁ డనేక ద్వారములు గడచి తుట్టతుదకు రామద్వారము పేరుగల లోపలిగుమ్మమువద్దకు బోఁగా నక్కడివాండ్రు వాని నడ్డగించి వాని వెనుక నింక నొక పెద్దసేన వచ్చుటం జేసియు లోపలకుఁ జొరనీయరైరి. అప్పుడుపాయములతో బనులు సాగవని యోరలోనుండి కత్తి నూడఁబెఱికి ద్వారరక్షకుల శిరంబుల కొబ్బరిపుచ్చెల ట్లెగరనఱకె. వెంటనే తొల్లిఁటి 'వేఁటకాండ్రందఱు వానికి సాయమై నిలిచిరి. చండుడు వచ్చెవచ్చె నని కోట యంతయుఁ బ్రతిధ్వను లెగయునట్లు కేకలు వెడలెను. రాణిసోదరులు నిశ్చేష్టులై యూరకుండిరి. చండుఁడు నిరపాయముగ సై న్యసమేతుఁడై కోటలో బ్రవేశించె.

చండున కందఱు గనఁబడిరి; కాని ముసలి రాజు గనఁబడఁ డయ్యె. అతఁడు నల్ల మందు మింగి యామత్తు చే స్పృహఁ దప్ప నొక మూలగదిలో గడ్డిపరుపు వేసిన మంచము పైఁ బండుకొనెను. ఆభత౯ చెంత రాణి చెలికత్తెయగు రాజపుత్రాంగన నిలువంబడియుండె. ఆమె కెవ్వరైన సన్న చేసిరో లేక యావలజరుగు కోలాహలము చేతనో యామె వాని తలపాగ నూడదీసి వాని మేనిచుట్టుం ద్రిప్పి గట్టిగా మంచమునకు బిగించికట్టి తానవ్వలకు దాఁటెను. చండునిబంట్ల సింహనాదములు చచ్చేడు వారి యాత౯ ధ్వనులు కత్తుల రాపిడిచప్పు డులు నగరమంతయు వినఁబడుచున్నను నల్లమందు తాతకు మెలఁకువ గలిగింపఁ జాలవయ్యె. ఎట్టకేల కతఁడు 'మెలఁకువఁ దెచ్చుకొని యమకింకరులవలే నెదుట నిలిచిన శత్రువుల మొగములఁ జూచె. అప్పుడు వచ్చియు రాని తెలివితో నాతఁడు కట్టువడిన సంగతి యెఱుఁగక లేవ నుంకించి లేవఁజాలక క్రోత్త పెండ్లాము చేసిన మోస మెఱిఁగి చింతించి హంమ్మని మంచముపాళమున లేచి యాయుధముకోఱకు వెదకుకొను చుండఁగా చండుని సేవకులు వానిం దుదముట్టించిరి.

ఇట్లు చిత్తూరు క్రొత్త ప్రభువుల బారినుండి విముక్తిఁ జెందెను