పుట:Raajasthaana-Kathaavali.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చండుని కథ.

39


చుఁ గోరచూపులఁ జూచుటయే కాని నోరెత్తి పలుకరైరి. ముక్కు పచ్చలారని యొక రాచకుఱ్ఱని నిమిత్తము చండశాసనులగు రాణిబందుగుల నెదిర్చి యెవ్వఁడు ధనమును బ్రాణమును బోఁగొట్టుకొనఁ గలఁడు ? పౌరుష శాలులగు ప్రజలీ తెఱంగున నసహాయులై యుండగాఁ నంతిపురమందలి యొక యాఁడుది యీ దౌర్జన్యముల సహింపక తెగువఁ జేసెను. అది ముకుళునకుఁ బాలిచ్చి పెంచిన దాది.రాజస్థానమునందు దాదులు తమ ప్రాణముల నేని ధార వూసి రాజకుమారుల రక్షించినకథ లనేకములు గలవు ముకుళుని దాదియు నట్టిదియె.

ఒకనాఁడు రణమల్లుఁడు కొలువుకూటములో రాణాకూరుచుండాడి సింహాసనము పైఁ గూర్చుండి తనమనుమనిఁదన కాళ్ళవద్దఁ గూర్చుండఁ బెట్టుకొనియాడించుచుండె. అంతలో బాలుఁడు మెల్లమెల్లగ దిగజారి నేల గంతులు వేయసాగెను. అప్పుడేనియు రణమల్లు గద్దె దిగక ఠీవితో గూర్చునియుండుటం జేసి సభవారికిని సభ వారికంటే నెక్కుడు దాదికిని మనసు మండెను. తోడనే దాది పట్టరాని బిట్టలుకతో నంతిపురిఁ బ్రవేశించి రాణి యొద్దకుఁబోయి నిలిచి జరుగుచున్న దౌర్జన్యమును విన్నవించి యెక్కడనుండియో పొట్టకూఁటికి జేరిన లాతివారు రాజకుమారునిఁ దృణీకరించి గద్దెయెక్కి కూర్చుండియుండగా సహించియూరకోనుట యుచితముగాదని నొక్కి చెప్పారు. రాణి తనతప్పుఁ దెలిసికొని యా రాత్రియే తనతండ్రిని జీవాట్లు పెట్టెను. వృద్ధుఁడగు రణ మల్లుఁడుపనికిమాలిన యాడుఁదానిపలుకులకు జంక గూడదని నిశ్చయించుకొని యెదు రామెపై గోపపడి , నేనును నాకొడుకులు చేసెడు పసుల కొప్పుకొని నీవు నోరుమూసికొని పడియుండుము. లేనిచో నీకుమారుని సింహాసనమున కేగాక ప్రాణములకుఁ గూడ నపాయము 'రాగల దని ప్రత్యుత్తర మిచ్చెను. ఆపలుకులు విని రాణి తనకును దనకుమారునకును నేమి కీడుమూడునో యని భయపడఁజొచ్చెను.

ఆమె భయము మఱింత యధికమగునట్టులు రాణా యొక్క