పుట:Raajasthaana-Kathaavali.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చండుని కథ.

37


అనంతరము రాణా హంసా దేవిని వివాహమాడుట కంగీకరించి మార్వారునుండి యామెను చిత్తూరునకు రప్పించి యచ్చటనే యధావిధిగఁ బెండ్లియాడెను. కొన్ని దినముల కాదంపతులకు ముకుళుఁడను కుమారుడు కలిగెను. ముకుళుఁడు పసితనమున నున్నపుడే లఘు మహారాజు వానిని విడిచిపోవలసి వచ్చెను. హిందువుల పుణ్య క్షేత్రమగు గయను మహమ్మదీయులు పట్టుకొని నాశనము చేయఁబోవుదు రని యారాణా విని తాను కత్తిగట్టి వారితోఁ బోరవలయు నని నిశ్చయించుకొని తురకల బారికిం దప్పి మరల తాము యాలుబిడ్డలను బ్రజలను దేశమును జూడ వీలగునో లేదో యని సందేహించి చండునిం బిలిపించి తన పయన మేఱిఁగించి బాలుఁ డగు ముకుళునకు రాజ్యములో నెంత భాగ మిచ్చిన బాగుంచు నని యడిగెను. చేసిన ప్రతిజ్ఞల నశి ధారావ్రతముగ నడపునట్టి చండుఁడు తండ్రి కిట్లనియె. ముకుళుఁడు మీవారు దేశమునకు రాజగు గాక ! అతఁడు గద్దె యెక్కినతోడనే నేను వానికివి ధేయుఁడనై ప్రియభృత్యులలో మొదటి వాఁడ నై యుందును. తండ్రి చేసిన ప్రతిన నిలిపి తా నాడినమాటఁ దప్పక నడచు కుమారుని జూచీ రాణా మహానంద భరితుఁడై నిర్విచారముగ గయకుఁ బోయి రణరంగమున నిలిచి మహమ్మదీయులతో బోరి లెక్కకు మీరిన వారి సేనలం గెలువలేక తుదకు మతము నిమిత్తమై ప్రాణములు విసజి౯ంచి వీర స్వర్గ మలంకరిం చెను.

రాణా పరలోకగతుఁ డైనవాత౯ మివారులోఁ దెలిసిన తోడనే చండుఁడు ముకుళుని రాజుగా నభిషేకించి వానికిం బదులుగ దానురాజ్యము సేయఁబూని తమ్మునిసింహాసనమున కీవల తనపీఠము వేయించుకొని సకల వ్యవహారములయందు రాజునకుం దోడ్పడుచు విధేయుఁ డై యుడి జనానురాగము గలుగునట్లు చక్కగఁ బ్రజా పాలనము చేయుచుండెను. చండునియం దందఱ కిష్టము నుండెను; కాని యే కారణము చేతనో హంసా దేవికిమాత్ర మిష్టము లేకపోయెను,