పుట:Raajasthaana-Kathaavali.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాహమీరు.

29


యాకన్నియను జేపట్ట తన తాతతండ్రులు పాలించునగరమునకు జనియె.

మాలదేవుని మందిరముసమీపమున కతఁడు పోయిన తోడనే వాని మనస్సు శంకింప నారంభించెను, పట్టణ మందుగాని రాచనగరు నందుగాని వివాహసంబంధ మయినశోభ యించుకయు గానరాదయ్యె. వేయేల? పెండ్లి ప్రయత్న మున్నట్లే తోఁ చదయ్యె. ఆస్థితిని జూచి వానియనుచరులు తప్పక ద్రోహము జరుగనని నిశ్చయించిరి, కాని హమీరు వారిని వారించి నిర్భయముగ నిశ్శంకముగ గుఱ్ఱము డిగి లోపలి హజారమునకుఁ జనియె. అక్కడ మాలదేవు బంధుగణ సమేతుఁడయి యెదురుగా వచ్చి పెండ్లి కొడుకును గారవించెను. పెండ్లి కొడుకువా రనుకొన్నట్లు ద్రోహ మేది యుఁ గనఁబడదు, కాని యది పెండ్లి వారి యిల్లువలె నుండదయ్యె. అంతట మాలదేవు వధువునుం బిలిపించి యామె నప్పుడే యక్కడనే నొక బ్రాహ్మణుని చేత హమీరునకు వివాహముఁ జేయి౦చెను. పెండ్లి కుమార్తె మేలిముసుంగుకొంగునకు పెండ్లి కుమారుని శాలువ చెఱుఁగు ముడివేసెడి తంత్ర మొకటి తప్ప మఱి యేతంత్రముగాని మంత్రముగాని కన్యా ప్రదానముగాని ఫలప్రదానముగాని జరుగదయ్యె.

దంపతు లిరువురు రాత్రి గలిసికొన్నప్పుడు ప్రపంచమునందే పురుషునకును భార్యగ నుండఁదగని యేవికృత విగ్రహముగల కురూపినో తనకుం గట్టిపెట్టి యుండరుగదా యని యనుమానించి హమీరు మునుముం దామె మేలిముసుఁగెత్తి మొగముంజూచెను, ఆముసుంగు మఱుంగున హమీరు నిరుపమానలావణ్యముఁ గలిగి శాంతరస మొలుకు వదనారవిందమును గనుఁగొనెను కాని యామె యతిదుఃఖతయై చిన్నఁబోయి మగని మొగముం చూచుటకే సిగ్గుపడు చున్న దానివలె కనంబడియె. ఆ తెఱంగున నున్న భార్యను జూచి హమీరు 'యేమిది మన కీవిధముగ నిర్మంత్ర విధిగా నిరుల్లాసముగా వివాహము జరుగఁ గారణమేమి? నీవిట్లు బిట్టువగవ నేల? యని యడిగెను. అన