పుట:Raajasthaana-Kathaavali.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణాహమీరు.

23

నివై యెడతెగక మండుచుండు ననియు నాద్వారముముందర నొక పెనుత్రాఁచుఁబాము చుట్టలు చుట్టుకొని పండుకొని యెవరయిన నచ్చటికి వచ్చినప్పుడు నిప్పులు విసముం గ్రక్కుచు వచ్చెననియు జనులు కొంతకాలము చెప్పుకొనిరి.

రాజపుత్రు లది మొదలు రణరంగమున నెంతెంత శూరులైన శత్రులనైన నెదుర్కొన సాహసించిరిగాని యానేలగదులఁజూచుటకు జననొల్లరైరి. మేవారుదేశస్థు లగురాజపుత్రు లీనాఁడును గొప్ప యొట్టు పెట్టుకొనవలసినప్పుడు 'చిత్తూరు నాశనము చేసినట్టే' యనుచుందురు. ఆనగరము ముమ్మారు మహమ్మదీయులచేత ధ్వంసము చేయఁబడి యిష్టదేవతలవల్ల, బరిత్యజింపఁబడి మేవారు రాజకుటుంబము చేత విడువఁబడి యున్నందున నిప్పుడు పూర్వవైభము దొలంగి నామావశేషమై కథావశేషమై చూచువారలకు వినువారలకు దాని చరితము దుఃఖకారణ మగును.


రాణా హమీరు.

——:(0):——

అల్లాయుద్దీసు చిత్తూరుపై దండెత్తకమునుపు రాణా లక్ష్మణసింగుయెుక్క పెద్దకుమారుఁడు హరసిం గోకనా డండ్వాయడవికి సపరివారముగా వేఁటకుఁ జని గుహలో నున్న యొక యడవిపందిని లేపి తఱుముగా నది దొరకక పఱచిపఱచి చివరకోకజొన్న చేనిలోఁ దూరి దాఁగెను. రాజకుమారుఁడును వానిబంట్లును చేనిచుట్టు కాచుకొని యుండి పంది నెవరయిన చేనిలోనుండి బయటకుఁ దఱిమిన బాగుండునని తలంచిరి. ఆ చేనిలోఁ బిట్టలఁదోలుటకై కట్టఁబడిన మంచెపై మాసిన గుడ్డలు కట్టుకొని దృఢశరీరముతో నున్నయొక పడుచుకన్య తప్ప చూపుమేరదూరములో వారి కెవ్వరుఁ గనఁబడ రైరి. వేటకాండ్రప్రయత్నముం జూచి యాబాలిక యీమృగమును మీవయి