పుట:Raajasthaana-Kathaavali.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

రాజస్థానకధావళి.


గోట్టకొనకు విజయము మ్లేచ్ఛులకే లభించెను. రాజపుత సేనలు పేరైన లేకుండ నశించిన పిదపఁ జక్రవర్తి జయజయధ్వనులతో గోటఁ బ్రవేశించెను.

అతఁడు ప్రవేశించి చూచునప్పటికీ మహాలక్ష్మి విహరించు మందిరంబులు నిర్మానుష్యములై మృత్యుదేవత కొలువుఁ జేయు హజారములై యుండెను. పరిజనంబుల కోలాహలంబులఁ బ్రతిధ్వను లిచ్చు చదుకములు నిశ్శబ్దములై భయంకరములై యుండెను. వీధులు విపణీతలంబులు గుళ్ళు గోపురములు మఠములు మందిరములు వెల వెల బారుచుఁ గఠినచిత్తు లైన తురకలకు సైతము వేఱపు గొలుపఁ బొచ్చెను. చక్రవర్తి యిట్లు పాడువడియున్న తావులు జూచుచు నంతఃపురమునకుఁ బోయి హృదయేశ్వరి యైనపద్మినికో ఱకు వెదకులాడి యామె నెందుం గానక తనలో 'పురుషులందఱు యుద్ధమునం జచ్చిరి సరే, ఇది యేమిచిత్ర మాడుది యొక్క తెయైనం గానఁబడదు. ఆడువాండ్రందఱు నేమైరి చెపుమా ' యని విచారించుకొనుచు నలు దెసలు పరికించి చూడ నొక వైపుననుండి కమరుకంపుతోఁ గూడిన నల్లనిపొగ బయలు దేఱి వచ్చుచుండెను. దానిం బట్టి శుద్ధాంత కాంతా జనంబులు చిచ్చురికి చచ్చి యుందు రనియు వారితోఁ బద్మినియు నశించి యుండు ననియు నిశ్చయించుకొని యందఱి ప్రాణములు దీసి నను తనమనోరథసిద్ధి గాకపోయెగదాయని బిట్టువగచి నిప్పులగుండము లున్నయా నేలగదులం జూడఁగోరెను. అలా యుద్దీను సేవకులలుం డెలు తీసినబంటు లే యైనను వారిలో నతి ధైర్యవంతులు సైత మా నేలగదుల తలుపులం దెఱవ సాహసింపరైరి.

నాటికి నేటికి నాస్థలఁ బుల కెవ్వరుఁ బోవఁజాలరు. ఒకమారోక మనుష్యుఁడుమాత్ర మాచీఁకటి సొరంగముల ద్వారముల దాఁటి యావలకుం జని మరల నేదో భగవత్కటాక్షమునఁ బ్రాణములతో బయటికి రాఁగలిగె నని చెప్పుదురు. అచ్చటియగ్ని హోత్రము లార