పుట:Raajasthaana-Kathaavali.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

రాజస్థానకథావళి.


నామెపరిచారికలు వచ్చుటకుమారుగ నేడువందలపల్లకులనుండి యేడు వందలమంది మహావీరు లగురాజపుతులు వెలువడి యాయుధ పాణులై నిలిచిరి. పల్లకులు మోసినబోయ లందఱు సైనికులై కత్తులు యుద్ధసన్నుద్దులైరి. చక్రవర్తిసేన యింతపాటు వచ్చునని యెఱుంగక నిర్లక్ష్యముగ నుండుటం జేసి రాజపుత్ర సైనికులు కఱకు తురకలపైఁ బడి సంహరించి సైన్యంబును బటాపంచలు చేసి తురకలు తమ రాజునకుఁ గావించినద్రోహమునకుఁ బరాభవమునకుం దగినట్లు కసిఁ దీర్చుకొనిరి. రాజపుత్రు లసహాయశూరు లై పగతురం బొడిచి నురుమాడిరిగాని చక్రవర్తియొద్దకుఁ బోయి వానిం గడతేర్ప నేరక నలుదెసలం గమ్మిన మ్లేచ్ఛసైన్యంబుచేఁ గ్రమక్రమంబునంగూల నారంభించిరి. భీమసింగును పట్టుకొనుటకు వెంటనంటి చన్న తురక బంటుల కతఁడు దొరకక పల్లకి దిగి వేగనంత మగునోక గుఱ్ఱము నొక్కి ప్రాణము దక్కించుకొని మీవారు రాజ్యమును సంరక్షించుటకు బ్రతికి కోటలోఁ బడెను.

అల్లాయుద్దీను నీవిధముగ వంచించి భీమసింగు ప్రాణముఁ బద్మినిమానముఁ గాపాడిన గోరాసింగును దక్కిన రాజవుత్రశూరులును స్వదేశమున కయి ప్రాణముల విడిచి యుద్ధభూమిని బడియుండిరి. రణనిహతులగు శూరులపత్నులు చిచ్చురుకుటకు సిద్ధముగ నుండ సంతలో యుద్ధము నుండి తప్పించుకొని బాలుం డగు బాదూలుం గచ్చటికి వచ్చెను. గోరాసింగుభార్య వానిం జూచి 'నాయనా ! కయ్యమున నాప్రాణేశ్వరుం డెట్లు వర్తించెనో విన(గోరుచుంటిగాన నే నాయనను గలసికొనుటకుఁ బోవక మునుపే నా కెఱిఁగింపు' మని యడిగెను ఆపలుకులు విని బాదూలుసింగు “తల్లీ ! అతఁ డిట్లు వర్తించినాఁ డని నేను వర్ణింపఁ గలనా ? నీహృదయేశ్వరుంచు స్వదేశ సంరక్షణమునకై శౌర్యము మెఱయఁ బోరాడి తన క్రొన్నెత్తుటిచే భూ దేవీ నలంకరించి ప్రాణములఁ బరిత్యజించి వీరస్వర్గముఁ జూరఁగొని యున్నవాఁడు. పగతుర