పుట:Raajasthaana-Kathaavali.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మిని.

15


జేయుటకంటెఁ బద్మినీదేవి నాదురాత్మునికడకుఁ బనుచుటయే కాలోచిత మని సిద్ధాంతీకరించిరి. పద్మిని, ప్రాణరక్షణమునకన్న మానరక్షణమే యధికముగా నెంచుకొను రాజపుత్ర, స్త్రీ యయ్యు రాజబంధువులు చేసినతీర్పు నీచమని నిరాకరింపక యాపత్సమయమున మానభంగము రాకుండఁ గాపాడు నాయుధమును జెంతనుంచుకొని పోవుటకు సిద్ధ మయ్యెను. అంతటఁ జిత్తూరుకోటలోనుండి యేడువందల పల్లకులు స్కంధావారమునకు బయలు దేరెను. పల్లకి కాఱుగురు బోయలు చొప్పున రమారమి నాలుగు వేలమంది బోయ లోంకార ధ్వనులచే దిక్కులు పిక్కటిలునట్లు దానిని మోసికొనిపోయి చక్రవర్తి శిబిరమున దింపిరి. పద్మిని మేనమామయగు గోరాసింగును వానీయన్న కొడుకు పండ్రెండేండ్ల ప్రాయమువాఁడు బాదూలుసింగును పల్లకుల వెంట వచ్చిరి. పద్మిని వెంటఁ బల్లకులలో గూర్చుండివచ్చిన తక్కినవా రెవరిని చక్రవ ర్తి యడుగఁ బద్మినీ దేవిని సాగనంపుట కై చెలికత్తెలు, చుట్టములు పరిచారికలు లోనగువాండ్రు "ప్రేమాతిశయమున వచ్చిరని గోరాసిం గుత్తరముఁ జెప్పెను. రాజపుత్ర స్త్రీల ఘోషా చెడకుండఁ జక్రవర్తి గుడారములు వేయించి జాగ్రత్త పెట్టించుట చే బోయలు పల్లకుల నచ్చట దింపిరి. గోరాసింగు చక్రవర్తియొద్దకుఁ బోయి తన మేనకోడలు కడసారి భర్తతో మాటలాడఁ గోరుచున్నది. కావున నట్లు చేయుట కనుమతింపమని ప్రార్థింప నల్లాయుద్దీను సంతోషపరవశుఁ డై యఁదుకు సమ్మతించెను. భీమసింగు గుడారములోపలి కరిగి లోని వారితో నించుక మాటలాడి పద్మిని యెక్కి వచ్చిన దన్న పల్లకి నెక్కి మెల్ల మెల్లఁగ నావలికిం దాఁటెను. కుటిలుఁ డగు చక్రవర్తి పద్మినిని స్వీకరించియు భీమసింగును విడువ నిచ్చగింపక భీమసింగు తప్పించుకొనిపోవుట గ్రహించి వానిం బట్టుకొమ్మని విచ్చుకత్తుల జోదులఁ బంపెను. అసమయమున మహమ్మదీయుల కద్భుతముగ. సింహళ రాజకన్య యగు పద్మినీ దేవియు