పుట:Raajasthaana-Kathaavali.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

రాజస్థానకథావళి.


లోఁ దనకుఁజూపిన తాను రాజపుత్రుల బాధింపక సంతసించి పోవుదు ననియు భీమసింగునకు వర్తమాన మంపెను. తనపగతుఁడు తనవలె మాటదప్పని మనుష్యుఁ డనుకొని భీమసింగు వానికోరికఁ దీర్చుట కియ్యకొనెను. అలాయుద్దీను పరమానంద భరితుఁడై స్వల్ప పరివారముతోఁ జిత్తూరుకోటకుం జని రాచనగరుఁ బ్రవేశించి యచ్చట నోక నిలువుటద్దములోఁ బద్మినీరూప ప్రతిబింబమును జూచి కృతార్థుడై భీమసింగున కెన్నియో సలాములు చేసి కోట విడిచిపోయెను. అంతటి చక్రవర్తి తనయింటికి వచ్చినప్పుడు కొంతదూరము వానిని సాగనంపక పోవుట సదాచారము కాదని యెంచి రాజపుత్రశూరుఁడు కోట విడిచి కొండ దిగి చక్రవర్తి వెంట శిబిరమునకుఁ బోయెను. పద్మినీ దేవి సొగసులుగులుకు తమ్మికొలను కెలఁకున నొక మేడలో నుండి ప్రాణేశ్వరునిరాక కెదురుచూచుచు నెంత సేపటికి నతఁడు రామి కలవలపడఁ జొచ్చెను. మానధనుఁ డగు భీమసింగు తన్ను సాగనంపుటకుఁ తప్పక వచ్చునని యెఱింగి కఱకుతురక తనశిబిరము చెంత నొక గుట్టచాటున నాయుధహస్తు లగుభటులను దాఁచినందున రాజపుత్రుఁడు చక్రవర్తివద్ద సెలవుం గైకొని కోటకుం బోవ మఱలిన తోడనే తురక జోదులు వానిపైఁ బడి పట్టుకొని శిబిరమునకుం గోని పోయి యజమానుని యానతిం, జెరఁబెట్టిరి. చక్రవర్తి యుఁ దనకావించిన గొప్పపనికి సంతసించుచుఁ బద్మినీదేవిని నాకుం గానుక గా సమర్పింపక పోయిన పక్షమున భీమసింగు నింక' విడుచువాఁడఁ గా' నని ప్రతినఁ జేసెను.

ఇంతలో నేవకులు పరుగుపరుగున వచ్చి యాయశుభవార్త దెలిపి దేవిని రాజబంధువులను దుఃఖనుగ్ను లం జేసిరి. తక్షణమ రాజపుత్ర నాయకు లందఱును గర్తవ్యమును నిర్ణయిం చుటకుం గొలువుఁ దీర్చి భీమసింగువంటి శూర శిఖామణిని గోల్పోయి చిత్తూరు రాజ్యలక్ష్మిని దిక్కుమాలిన దానిగాఁ జేసి రాజకుమారు నసహాయు