పుట:Raajasthaana-Kathaavali.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మినీ.

13


రావణుఁ డయ్యెను. అతఁడు తనపై దండెత్తి వచ్చిన పగఱఁ 'బారదోలుటలోను పరరాజుల దేశముల నాక్రమించుటలోను పితూరీల పేరైన 'లేకుండ నడచుటలోను సాటి లేని చండశాసనుఁ డగుటచే వాని రాజ్యము సకలైశ్వర్యముల కునికీపట్టయి విలసిల్లెను. ఆతని క్రౌర్యము నిరంకుశమై నేరములు చేసిన వారియెడలనేగాక నిరపరాధులగు వారి యాలుబిడ్డల పై సైతము జూపఁబడుచు వచ్చె. ద్రోహులగు పురుషుల దండించిన రాజు లనేకు లుండిరి కాని యేపాప మెఱుఁగని పసిబిడ్డలను బడఁతులను గ్రూరశిక్షల పాల్గావించు నీచు నితనిఁ దక్క మఱోకని నెఱుఁగము ప్రజల హింసించుటలో నతనికి హిందువులు మహమ్మదీయు లను భేదము లేదు. స్వమతస్థు లగు తురకలు సయితము వాని సెలవు లేక యొకరిదర్శన 'మొకరు చేయరాదు. విందులకుఁ బోరాదు. పదిమంది చేరి మాటాడరాదు. వేయేల! తనపాలనకు లోఁబడిన యానాఁటిహిందువుల నితఁడు కడుపునిండ దిననీయక కంటినిండ నిదురఁ బోనీయక పన్నుల వేసి బందెల ద్రోసి పీడించుటచేఁ దల గోకికొనుట కైనను వారికి స్థిమితము లేకపోయె నని యొక చరిత్ర కారుఁడు వ్రాసి యున్నాడు . అట్టి యీమహాపాతకుఁడు, పద్మినీ దేవి సౌందర్యాతిశయములను వీనుల విందుగా విని యామెను జేకోనఁగోరి మహాసేనం గూర్చు కోని యడవులు గొండలు నేఱులు దాఁటి మీవారు దేశము జోరఁబడి చిత్తూరునగరపుఁగోట యెదుట నిలిచి పద్మినీదేవిని తనకుం గానుకగ నడిగెను. రాజపుత్రులు నింద్యమగు తనకోరికను నిరాకరించుట చేతను నగరపు రాతికోట తనకు దుర్భేద్య మగుట చేతను జక్రవర్తి తన యాట లచ్చట సాగిరావని తెలిసికొని బింకము వదలి సామవాక్యములకుం జొచ్చి పద్మినీదేవి తన కక్కర లేదనియు నామె చక్కదనము తాను వినినంత జగన్మోహనముగ నుండునో లేదో యెఱుంగఁ గగోరి వచ్చితిననియుఁ బద్మినీ దేవి రూపప్రతిబింబము నొక యద్దము