పుట:Raajasthaana-Kathaavali.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

రాజస్థానకథావళీ,


యున్నను వార్థకము చేత నిల్లు కదలి రాలే నని వర్తమాన మంప జహంగీరు వానిని క్షమించెను. -

చక్రవర్తినిఁ జూచుట తప్పించుకొన్నను రాణా వానికుమారుని దర్శనము చేయక తప్పదయ్యె. అందుచేత నుమ్రా పాజహాను దర్శనముకుఁ బోయి. వాని మోకాలిమీఁదఁ జేయివేసి తన్ను క్షమింపు మని ప్రార్థించెను. షాజహాను వానిని మన్ననతోఁ గౌరవించి వానిపరివారమునకు గుఱ్ఱములు విలువగల నగలు బహుమానము లిచ్చి పంపెను.

పాజహానుతల్లి రాజపుత్ర స్త్రీ యగుటచే నతనిశరీరమున గూడ రాజపుత్రత్వమే ప్రవహింపు చున్నందున గాఁబోలు కడుదీనుఁడై ముఖ విలాసము డీలుపడి యున్న రాజపుత్రప్రభువును జాల బహూకరించెను. ఉమ్రా పాజహానున కెన్నీ మన్ననలు చేసినను కొట్టకొనకు ఢిల్లీ నుండి చక్రవతి౯ ఫర్ మానా వచ్చినప్పుడు కోట వెలుపలకు వచ్చి దానిని పుచ్చుకొన్నం జాలు నొక్క తురక బంటైన మీవారు దేశమున నుండకుండఁ జేసెదనని షాజహా నెన్ని విధముల వత౯మాన మంపినను వినక రాణా షాజహానుని యందుగల సుగుణము లబట్టి యతని దర్శనము మాత్రము చేసి వెళ్ళిపోయెను.

ఇదియైన కొన్ని నాళ్ళకే రాణాకుమారుఁడు కరుణుఁడు చక్రవతి౯ కొలువు సేయుట కజిమీరునకుఁ బోవలసి వచ్చెను. అప్పుడు కరుణునిసభలోఁ దన సింహాసనమునకు గుడివైపునదగు పీఠముమీఁదఁ గూర్చుండ బెట్టవలయుసని జహంగీరునకు షాజహాను వ్రాసెను. ఆరాజకుమారుఁడు మిక్కిలి మొగ మోటము గలిగి యెవరితోఁ గలిసి మెలసి మాటాడక సిగ్గుపడినట్లు సభలోఁ గూర్చుండుచు వచ్చినాఁడని జహంగీరు తన దినచర్యగ్రంథములోఁ బలుమారు వ్రాసెను. అందఱి కంటే నెక్కువ నల్లమందు మద్దతు పీల్చుచు సాయంకాలమునందు హాలిర్ డు అనియెడు నింగ్లీషువాని నొకనిగూడి నోటిలో నన్నపుముద్దనయిన బెట్టుకోనుటకయిన నోపిక లేనట్లు చెడత్రాఁగి యొడలు తెలి