పుట:Raajasthaana-Kathaavali.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిని, మీవారునకును సంధి.

187


ఈనాటివఱకు రాణా యుమ్రాయు, వాని పితృపితామహప్రపితామహులు తమ సైన్యములు మిక్కిలి శౌర్యవంతము లనియుఁ దమ దేశము పర్వతమయ మగుటచే, శత్రుదుర్భేద్యమనియు నమ్మి యెవ్వరిని లక్షము సేయక హిందుస్థాన చక్రవతి౯ నెన్నఁడుఁ జూడఁబోక, యితరుల నెన్నఁడుఁ దమ దేశములో నడుగు పెట్టనీయక గర్వభూయిష్టు లయి యుండిరి. అట్టిగర్వోన్నతులు నాయదృష్టవశమున నాకాలములోనే లోఁబడుటచేత నిట్టి సమయము దాటిపోఁగూడ దని నిశ్చయించి నాకుమారుని ప్రేరణంబున రాణాను క్షమియించి యతనిని జాగరూకతతో రక్షింతునని స్నేహపత్రిక నొకదానిని వ్రాయించి నాహస్తము మంచి గంధమున నలఁచి యాచేతిముద్ర కాగితముమీఁద వేసి రాణా యొద్ద కంపితిని. అట్లు పంపుటయేగాక సుప్రసిద్ధుఁ డగు నీరాజపుత్రుని వానిమనసు వచ్చిన తెఱఁగున సగౌరవముగా నాదరింపుమని నాకుమారు నియమించితిని."

అదివఱకే గుండెలు చెదరిపోయి యున్న రాణా యీలోఁబడుట వలన మఱింత దుఃఖపడకుండు నట్లు చక్రవతి౯ వానియెడ దయామయుఁడయి యుండెను, జహంగీరు సహజముగ మదగజముల వలె పోగరుకలిగి యప్పుడప్పుడు మద్యపాన నుత్తత చేత మిక్కిలి క్రూరుఁడై యుండినను కొన్ని వేళల జాలిగుండె గలిగి చేజిక్కిన శత్రువులనైన నత్యంత గౌరవముతోఁ జూచు చుండును. అందు చేత మీవారు రాణా లెవరు స్వయముగ చక్రవతి౯నిఁ గొలుచుటకు డిల్లీకి బోనక్కరలేదనియు నేరాజ యయిన నూతనముగ మీవారు సింహాసన మెక్కినప్పుడు చక్రవతి౯ దాని యాధిపత్యమును స్థిరపర్చుచుఁ బంపెడు ఫర్ మానా రాణా కోటలోనుండి వెలుపలకు వచ్చి పుచ్చుకోనవలసినదనియు చక్రవతి౯ సైన్యమునకు రాణా వేయిగుఱ్ఱపుదండుఁ బంపవలసినదనియు జహాంగీరునకు నుమ్రాకు నొడంబడికలు జరిగెను. ఇదియే నుమ్రా కోరిక, సంధి యయినపిదప నుమ్రా చక్రవతి౯ దర్శనమునకుఁ బోవలసి