పుట:Raajasthaana-Kathaavali.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశ రాజకుమార చరిత్ర,

183

దుగ౯ రక్షకులు వానిం గత్తులతో నరుకను బల్లెములతో గ్రుమ్మను తుపాకులతో, గాల్చను బాల్పడిరిగాని యాజోదు చెక్కు చెదరక యుక్కు తునక లాగున బురుజుపై కెక్కెను. ఎక్కి యటనుండి గంభీర స్వరముతోఁ "రాణా సేనను నడుపుటకు చదావతులే యర్హులు, మేమే కోటముందు జొచ్చితి” మనిపలికి శవముఁ జేత పట్టుకొని విసరి కోటగోడల నడుమ పారవైచెను.

అనంతరము చందావతులు మిడుతల దండుం బోలె కోటపయి కెక్కి తమయేలిక చచ్చినం బ్రతికిన వానినే యనుసరింతు మనుమాట రూఢి చేసిరి, అంతలో సూక్తవతులు కుల గౌరవమునిమిత్తము తమనాయకుఁడగు యచలుని బలియిచ్చి కవాటంబు భేదించి లోనం జొచ్చిరి. కోట యెవరు ముందుజొచ్చిన నెవరు వెనుక జొచ్చిన యామాట యటులుండనిచ్చి యా రెండు తెగలవారు సామాన్యశత్రువులగు తురకలఁ దరిమితరిమి కొట్టిరి. అందుచే రాజపుత్రులకుఁ గన్ను లపండువుగ మీవారు రాజుల విజయధ్వజము అంతల్లాకోట బురుజు పై నిల్చెను.

కోట స్వాధీనము చేసికొని రాజపుత్రులు లోపలి మందిరంబులకుం జెన వారి కోక చిత్రము కనఁబడెను. ఆ మందిరమున నోక గదిలో నిద్దఱు గొప్పతురకలు నిర్విచారముగ చదరంగ మాడుచుండిరి. ఒకవిధమయిన కలకలము వారి చెపులం బడియెనుగాని పగతురు వచ్చి యంతల్లా కోటను బట్టుకొనుట యసాధ్యమని వారు సరకు సేయరయిరి. ఆట మంచి రక్తి యగు పట్టునకు వచ్చినప్పుడు రాజపుత్రులు యమదూతల వలె యా యుధ పాణులయి వచ్చి నిల్చి వారిం జంపఁబోయిరి. అప్పు డాకరకుతురక లిరువురు రాజపుత్రులం గనుం గొని "ఆగుఁడు. ఆగుఁడు, ఆట మిక్కిలిరక్తిగా సున్నది. ఈయాట ముగియువఱకు మమ్ముఁ జంపవల"దని బతిమాలుకొనిరి. రాజ