పుట:Raajasthaana-Kathaavali.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

రాజస్థానకధావళి


అప్పలుకులు విని సలుంబ్రా దిగ్గున లేచి పరుగు పరుగున రాణా యొద్దకుఁ బోయి తరతరంబులనుండి తనకుటుంబమునకు జరుగుచున్న యాగౌరవమును తీసివేసి యింకొకరి యధీనము చేయుట తగదని గటిగ వాదించేను. సూక్తవతులును వెనుదీయక రాణాయొద్దకుఁ బోయి "మీరు సేనల నడువునధికారము మాకిచ్చితి మని మీనోటితో మీరే సెలవిచ్చి యున్నారు. చండుఁ డెన్నఁడో 'యేమో చేసెనని మా కిప్పు డిచ్చిన వరము మరల పుచ్చుకొనుట న్యాయము కాదు. ఎవరడ్డము వచ్చినను సేన నడుపకమాన”. మని ప్రతిఘటించి నిల్చిరి.

అప్పుడు పొడమినయీర్ష్యచేత సూక్త తులు చందావతులు మహారోషపరవశు లయి యొకరినొకరు నరుకుకొనుటకుఁ గత్తుల దూసిరి. కాని యుమ్రా వారి నడ్డగించి "మీ కీపోరాటము లేందుకు? మీవివాదము నేను దీర్చెదను. ఇప్పుడు మొగలాయీల యధీనములో నున్న యంతల్లా కోటలో మీయిరువురలో నెవరు ముందుగాఁ బ్రవేశింతురో వారే నాసేన నడపించు గౌరవమునకుఁ బాత్రులగుదు” రని యానతిచ్చెను.

అంతల్లాకోట యప్పటికిని 'మొగలాయీల యధీనములో నుండెను. ఇది దుగ౯మములయినకోటలలో నొకటి. ఇది యుదయపురమునకు పదునెనిమిది మైళ్ళదూరమున చిత్తూరునకుఁ బోవు దారిలో నున్నది. ఆకోటయడుగున నొక చిన్న నది పారుచుండును.ఆకోటలో నొక చిన్న కోట కలదు. అందులోనే దుగ౯రక్షకుఁడు వశించుచుండు. రాణా యానతి చొప్పున సూక్తవతులు చందావతులు మరునాఁ డుదయమున నంతల్లాకోటకు బయలు దేరిరి. కాని సూక్తవతులు పదునాఱుగురు చందావతులు రాకమున్నె దుగ౯ముఁ జేరి తాము పెందలకడ వచ్చినందుకు చందావతులు రానందుకు సంతసించి గోడ లెక్క బ్రయత్నించిరి; కాని పయనపుగడబిడలో