పుట:Raajasthaana-Kathaavali.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

రాజస్థానకధావళి,


డుటచే నపుడు గల్గిన యాబిడ్డకు వా రాశుఁడని పేరు పెట్టిరి. అనంతర మాసోదరులు యీడూరుగ్రామమునకుం జన నాపురాధీశుఁడు వారి నాదరించి తగినబసలు మాన్యములు నిచ్చెను. అక్కడ వారు సుఖముగ కాలక్షేపము సేయుచుండ నొకనాఁడు మీవారు దేశపుమంత్రి యాదారిం బోవుచు భార్యాసమేతుఁ డయి యూయూరుబయిటి గుడారములో విడిసెను. అప్పుడు పెద్దగాలి వాన సంభవింప దానిచే గుడారము తెగిరిపోవసాగెసు. మంత్రియు భార్యయు నిలువనీడలేక యిబ్బంది పడుచుండ బలుఁడు నచలుఁడు వారి దుస్థితి విని తోల్లి తాము నట్టి దురవస్థనే బడియుంటి మనుమాట జ్ఞప్తికిఁ దెచ్చుకొని వారిం దమ యింటికిఁ బిలుచుకొని వచ్చి యుపచారము చేసి యాదరించిరి.

ఆమంత్రియు వారి యాదరణంబునకు మహానందభరితుఁ డయి పోరినందఱఁ దనతో నుదయపురమునకు రమ్మనియు వచ్చినచోరాణా వద్దఁ దగినయుద్యోగముల నిప్పింతుననియు వారి యన్న యగుభాంజీ మరియొకలా గనుకొనకుండ తాను సర్ధి చెప్పుదు ననియు నొక్కి చెప్పెను. కాని యచలుఁడు వానిమాటల కీయకోనక పిలువని పేరంటముగ పోయినచో లోకువ యగునని స్వగౌరవము కాపాడుకొనఁ దలచి మాజ్క్షాతి యగురాణా వర్తమాన మంపినచో వత్తుమనియు లేనిచో నచ్చటనే యుందు మనియుఁ జెప్పెను.

మీవారు రాణా ఢిల్లీ చక్రవతి౯పై కప్పుడు పోవ యత్నించు చుండ మంత్రి సూక్తునికోడుకులఁ గైకొని యాపదునాఱ్గుర నచ్చటికి రావించెను. అంతకుమున్నె సూక్తవంశమునం దగ్రగణ్యుఁ డగు భాంజీ రాణాకుఁ దోడుసూపుట కచ్చటికి వచ్చియుండెను. అతఁ డందఱికన్నఁ బెద్దవాఁడై నను వానిమాట సరకు సేయక నెల్లవారును వానితమ్ముల యందే యనురక్తులయిరి. మహాసాహసుఁ డగుబలుఁడు శూరులగు తనసోదరులు కడువిధేయులయి పనులు సేయుట చే రాణాకు వారియందే యనుగ్రహ ముండెను. అందు ముఖ్యముగ బలుఁడు