పుట:Raajasthaana-Kathaavali.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

రాజస్థానకథావళీ.


సింహాసనమున కెదుట మొక్కవలయు నని యాయుత్త రమందు లేదు. ఆజాబు పృథివిరాజే వ్రాసెను. అతఁడు మంచికవి యగుటచే దనవిచారము విస్మయము రసపంతము లగుపద్యములుగ వ్రాసి యీ లేఖలోఁ బంపెను. ఆందుల సంగతు లిట్లున్నవి. « హిందువుల కష్టసుఖములకు హిందువులే తోడుపడవలయును. అయినను రాణా యిప్పుడు వారిని విడుచు చున్నాఁడు, ప్రతాపుడు లోఁబడె నేని యక్బరు రాజపుత్రులనందఱ హీనముగఁజూచు. ఈవఱకే మనలోఁ మగవారు శౌర్యధనమును ఆడు వారు మానధనమును గోల్పోయిరి. అక్బరు మనజాతి వారిని వెలకుఁగొను వత౯కుఁడై యుదయపురాధీశునిఁ దక్కఁ దక్కినవారిని క్రయమునకుం దీసికొనియె. నిజమయిన రాజపుత్రుఁడు గౌరవము నమ్ముకొనునా ! అయిన నెంద రీవఱకు విక్రయించిరో మీ రెఱుంగుదురు. ఉదయపురముఁ గూడ నిపు డీబజారునకు వచ్చునా ? ప్రతాపుడు తన సర్వధనములఁ గోల్పడినను మానధనమునుమాత్రము నిలుపుకొనియె నని మేము తలంచు చున్నాము. ఆశ లడుగంటుట చేత రాజపుత్రులీ విధమున నొకనికిఁ జేయొగ్గిరి. అట్టి యవమానము పాలఁ బడకుండ హమీరుని వంశస్థుఁ డొక్కఁడే యిప్పటికి మానము దక్కించుకొని యున్నాడు. ప్రతాపున కెక్కడనుండి సహాయము వచ్చు చున్నదని లోకు లందఱు విస్మయ మందు చున్నారు. వానియభిమానము వాని ఖడ్గము వానికి సహాయము లగుచున్నవి, వాని ధైర్యముఁ జూచుకొసియే యతం డింతకాలము రాజపుత్రుల పేరు నిలువఁ బెట్టె. వీరపురుషులను క్రయమునకుఁ గోను నీవర్తకుఁ డెప్పటికైనఁ గడ తేరక పోడు. మనుష్యుఁ డెల్ల కాలము జీవించునా ? అప్పుడు మన రాజపుత్రులందఱు నిస్సారము లగుతమ హృదయ క్షేత్రముల మీద దేశాభిమాన బీజములను జల్లు మని యుద యపురాధీశ్వరునివద్దకు వత్తురు. ఆ యభిమానము నిలుపవలసినదనియు మునుపటికన్న మెఱయునట్లుఁ జేయుమనియు రాజపుత్రులందఱు వేడుచున్నారు."