పుట:Raajasthaana-Kathaavali.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా ప్రతాపసింగు.

167


నిజస్థితి యేమన నొకనాఁడు ప్రతాపుఁడు మహాకష్టములో నుండి నిరుత్సాహుఁ డై యా జాబుచక్రవర్తి కి వ్రాసెను, ఆయేటికాయేఁడు గడచుచున్న డన్న మాటయేగాని యతనికష్టము మాత్రము గడుపక యంతకంత కెక్కువ కాసాగెను. అతని నమ్ముకొనిన యనుచరులు కష్టములచేతనో గాయముల చేతనో క్రమ క్రమముగ నంతరించిరి. శత్రువులు మాత్రము విసుగు లేక వారిని బాధించుచునే యుండిరి. వేటకాండ్ర పగిది పగవాండ్రు వెనువెంట నంటి తరుము చుండుటం జేసి యొక నాఁడు వారైదుసారు. లన్నము వండుకొని యైదు సారులు దినుటకు వీలు లేక విడిచి ప్రాణభీతిం బఱచిరి. ఒకసారి ప్రతాపుం డడవిలో నొక చెట్టుక్రింద గూరుచుండ చిన్న కూఁతు రేడుపు వానికి వినఁబడె. తల్లి యాపిల్లకుఁ దిను మని యొక రోట్టె యిచ్చెను. ఆబిడ్డ సగముదిని యాఁకలి పూర్ణముగ దీరకున్నను రాత్రికుండదను భయమునతక్కినసగమును దాఁచుకొనెను. అంతట నొక మానుపిల్లి చెట్టుమీఁదనుండి దిగి వచ్చి యాసగమురోట్టె నెత్తుకొనిపోవ బాలిక వెక్కి వెక్కి యేడ్చెను. అదివఱకెన్ని కష్టములకై నఁగరుగని ప్రతాపుని మనసా చిన్న బిడ్డ యేడ్పులతోఁ గరగినీరై పోయెను. "నామట్టుకు నేను సకలసౌఖ్యములను 'రాజ్య వైభవమును విడిచి యీవఱకుఁ బడినట్లే యెంత కాలమైనను గష్టములఁ బడఁగలను; కాని దారపుత్రా దులను నానిమిత్త ము సుఖములను జుట్టములను బాసి వచ్చినమిత్రులను బాధ పెట్టి చంపుట న్యాయము కాదు. వారంద ఱింతవఱకుఁ నభి మానము నిమిత్తము పడవలసినన్ని కష్టములను బడిన వారు. పరువుగల వీరులంద రింతకుమున్నె చక్రవర్తి కిలోబడియుండ నే నిప్పుడు లోఁబడుట తప్పుగా “దని తనలో తాను విచారించి ప్రతాపుఁడు తాను లోఁబడుదు నని చక్రవర్తి కాయుత్తరమును వ్రాసి పంపెను.

ఎట్టకేలకు ఢిల్లీ నుండి యుత్తరము పట్టుకొని యొకదూత వచ్చెను. కాని ప్రతాపుఁడు సకుటుంబముగ ఢిల్లీ కివచ్చి చక్రవతి౯